
ఆ యువకుడు డిగ్రీ చదువుతున్నాడు. రోజు మాదిరిగానే కాలేజీకి వెళ్లి వచ్చాడు. సాయంత్రం ఇంట్లో కూర్చొని ఉండగా స్నేహితులు కాల్ చేశారు. బయటకు వెళ్లి వద్దాం అని చెప్పారు. దానికి ఒప్పుకున్న ఆ యువకుడు వారితో కలిసి బైక్ పై ఎక్కడికో వెళ్లారు. స్నేహితులతో వెళ్లాడు.. కొంత సమయం తరువాత ఇంటికి తిరిగి వస్తాడు అని ఆ యువకుడి తల్లి దండ్రులు ఎదురు చూశారు. కానీ బయటకు వెళ్లి చాలా టైం అయినా ఇంకా ఇంటికి తిరిగి రాలేదు. దీంతో అనుమానం వచ్చి స్నేహితులకు కాల్ చేశారు. కానీ అటు నుంచి సరిగా స్పందన లేదు. దీంతో ఆ గ్రామం చుట్టు పక్కల వెతికారు. కానీ కనిపించలేదు. దీంతో ఏం చేయాలో తెలియక పోలీసులకు వెళ్లి ఫిర్యాదు చేశారు. పోలీసు కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు ప్రారంభించారు. కానీ ఆదివారం ఓ వ్యవసాయ బావిలో అతడు అనుమానస్పదంగా మృతి చెంది కనిపించాడు. దీంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. ఈ ఘటన పెద్దపల్లి (peddapalli) జిల్లాలోని కాల్వశ్రీరాంపూర్ (kalwa sriramupur)మండల పరిధిలో జరిగింది.
పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కాల్వశ్రీరాంపూర్ మండలంలోని గంగారం (gangaram) గ్రామంలో దామ పద్మ (padma), మొండయ్య (mondaiah) జీవిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. వారిలో చిన్న కుమారుడి పేరు తరుణ్ (tharun). వయస్సు 19 సంవత్సరాలు. అతడు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ డిగ్రీ కాలేజ్ (degree colleage) లో ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. ఈ నెల 18వ తేదీన సాయంత్రం ఇంట్లో ఉన్నాడు. ఆ సమయంలో తరుణ్ ఫ్రెండ్స్ అయిన నూనె అనిల్ (nune anil), నూనె శివ (nune shiva)లు కాల్ చేశారు. బయటకు వెళ్లి వద్దాం అని చెప్పారు. దీనికి ఒప్పుకున్న ఆ యువకుడు వారితో బైక్ పై వెళ్లాడు.
ఫ్రెండ్స్ తో బయటకు వెళ్లిన కుమారుడు చాలా సేపు అయినా ఇంటికి రాలేదు. దీంతో తల్లిదండ్రులు కంగారు పడ్డారు. తరుణ్ ను తీసుకెళ్లిన స్నేహితులకు ఫోన్ చేశారు. వారి నుంచి సరిగా స్పందన రాలేదు. దీంతో తల్లిదండ్రులు బయటకు వచ్చి కాల్వశ్రీరాంపూర్ తోపాటు, పెద్దపల్లి వంట ప్రాంతంలో వెతికారు. కానీ తరుణ్ కనిపించలేదు. దీంతో శనివారం కాల్వశ్రీరాంపూర్ పోలీసులకు కంప్లైంట్ చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఆదివారం వెన్నంపల్లి (vennam palli) శివారులో ఓ అగ్రికల్చర్ ల్యాండ్ (agriculture land) లోని బావిలో తరుణ్ శవంగా కనిపించాడు. అతడి తలపై పెద్ద గాయాలు కనిపించాయి. అలాగే బాడీలోని పలు చోట్ల దెబ్బలు కూడా కనిపించాయి. మృతదేహం లభించిన స్థితి బట్టి రెండు రోజుల కిందట చనిపోయి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.
స్నేహితులతో వెళ్లిన కుమారుడు తిరిగి ఇంటికి వస్తాడనుకుంటే చనిపోయి కనిపించడంతో ఆ తల్లిదండ్రులు తీవ్రంగా తల్లడిల్లారు. తీవ్రంగా రోదించారు.తమ కుమారుడిని అతడి స్నేహితులే చంపేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనలో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. నిందితులను అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నట్టు పోలీసులు తెలిపారు.