
ఉత్తరప్రదేశ్ లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. భార్యపై అనుమానంతో భర్త ఘోరానికి పాల్పడ్డాడు. ఆమె తల, వేళ్లను నరికి హత్య చేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నలుగురిని అరెస్టు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. యూపీలోని బందా జిల్లాలో ఓ మహిళ అనుమానాస్పదంగా మరణించింది. తలలేని మహిళ మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. అలాగే చేతి నుంచి నాలుగు వేళ్లు కూడా గల్లంతయ్యాయని గుర్తించారు.
సుమారు 35-40 ఏళ్ల వయసున్న మృతురాలి పై పాక్షికంగానే దుస్తులు ఉన్నాయి. మొండెనికి కొంత దూరంలో తలను గుర్తించినట్లు ఎస్పీ అంకుర్ అగర్వాల్ ‘టైమ్స్ నౌ’తో తెలిపారు. మృతులను మధ్యప్రదేశ్ లోని ఛతర్ పూర్ జిల్లాకు చెందిన మాయాదేవి గా గుర్తించారు. ఆమె డెడ్ బాడీ లభించినప్పుడు తలకు జుట్టు లేదని, అలాగే దంతాలు కూడా విరిగిపోయి ఉన్నాయని ‘ఇండియా టుడే’ నివేదించింది. ప్రాథమిక దర్యాప్తు అనంతరం ఈ హత్యలో మహిళ కుటుంబ సభ్యుల ప్రమేయం ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.
అయితే విచారణలో తామే ఈ హత్యకు ప్లాన్ చేశామని భర్త రామ్ కుమార్, అతడి కుమారులు సూరజ్ ప్రకాశ్, బ్రిజేష్, మేనల్లుడు ఉదయ్ భాన్ అంగీకరించారు. అయితే రామ్ కుమార్ కు మృతురాలి రెండో భార్య. భర్తకు మొదటి భార్య ద్వారా కలిగిన కుమారుడితో ఆమెకు అక్రమ సంబంధం ఉందని రామ్ కుమార్ అనుమానించాడు. దీంతో అతడు తన కుమారులు, మేనళ్లుడితో కలిసి హత్య చేయాలని భావించాడు.
అందులో భాగంగానే మాయాదేవి దేవిని వారంతా చమ్రాహా గ్రామానికి తీసుకెళ్లి గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం డెడ్ బాడీని ఛిద్రం చేశారు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. 24 గంటల్లోనే కేసును పరిష్కరించి నిందితులందరినీ అరెస్టు చేశారు. ఈ హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.