మాజీ భార్య, పిల్లలను చూసుకునే నైతిక, చట్టపరమైన బాధ్యత భర్తదే.. ఢిల్లీ హై కోర్టు...

Published : Feb 18, 2022, 12:12 PM IST
మాజీ భార్య, పిల్లలను చూసుకునే నైతిక, చట్టపరమైన బాధ్యత భర్తదే.. ఢిల్లీ హై కోర్టు...

సారాంశం

విడాకులు ఇచ్చిన తరువాత ఆ భార్యను, మైనర్ పిల్లలను పోషించాల్సిన చట్టపరమైన, నైతిక భాద్యత భర్తదే అని ఢిల్లీ కోర్టు ఓ కేసులో తీర్పునిచ్చింది. అంతేకాదు వారికి అంతకు ముందు భర్తతో ఉన్నప్పుడు జీవించిన స్థాయిలోనే సౌకర్యవంతమైన జీవితాన్ని గడిపే హక్కు ఉందని తేల్చింది. 

న్యూఢిల్లీ : విడిపోయిన భార్యకు అంతకు ముందు భర్తతో ఉన్నప్పుడు జీవించిన స్థాయిలోనే సౌకర్యవంతంగా, సౌలభ్యంగా జీవించే సమాన అర్హత ఉంటుందని Delhi court ఓ కేసులో తీర్పు సందర్భంగా పేర్కొంది. ఓ కేసులో తన భార్య, మైనర్ కొడుకుకు నెలవారీ interim maintenanceగా రూ.35,000 చెల్లించాలని ఆదేశించిన ఉత్తర్వులపై ఒక వ్యక్తి దాఖలు చేసిన అప్పీల్‌ను కోర్టు విచారించింది. విచారణలో మాజీ భార్య తన భర్త, అతని కుటుంబ సభ్యులు తనకు dowry తీసుకురాలేదని విడాకులకు ముందు శారీరకంగా, మానసికంగా హింసించారని ఆరోపించింది.

“పిటిషనర్ అయిన భర్త.. ప్రతివాది అయిన భార్య, మైనర్ బిడ్డను కాపాడుకోవాల్సిన నైతిక, చట్టపరమైన బాధ్యతను కలిగి ఉంటాడు. పిటిషనర్‌లాగానే ప్రతివాది ఆమె బిడ్డ సౌకర్యవంతమైన  జీవన ప్రమాణాలకు అర్హులు” అని అదనపు సెషన్స్ జడ్జి సంజయ్ శర్మ ఫిబ్రవరి 15న ఒక ఉత్తర్వులో తెలిపారు. పురుషుడి లివింగ్ స్టాండర్డ్స్, అతని నెలవారీ ఆదాయం బట్టి.. అతని భార్య, మైనర్ పిల్లల సహేతుకమైన అవసరాలను దృష్టిలో ఉంచుకుని.. వారికి నెలకు రూ. 35,000 మధ్యంతర భరణం అనేది న్యాయంగా, సహేతుకంగా ఉన్నట్లు కోర్టు పేర్కొంది. 

"ఈ న్యాయస్థానం ఎటువంటి jurisdictional error, చట్టపరమైన బలహీనత లేదా భౌతిక అవకతవకలు, లేదా impugned orderలో చట్టం లేదా ప్రక్రియలో ఎలాంటి స్పష్టమైన లోపాన్ని కనుగొనలేదు" అనిపేర్కొంది.

ఇదిలా ఉండగా, జనవరి 12న ఇచ్చిన ఓ తీర్పులో వివాహితలు, అవివాహిత స్త్రీల గౌరవాన్ని వేర్వేరుగా చూడలేమని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. వైవాహిక స్థితితో సంబంధం లేకుండా..  ఇష్టం లేని, ఏకాభిప్రాయం లేని లైంగిక చర్యను నిరాకరించే హక్కు ప్రతి మహిళకూ ఉంటుందని ఉద్ఘాటించింది. వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించాలంటూ దాఖలైన పిటిషన్లపై జస్టిస్‌ రాజీవ్‌ శక్ధేర్‌, జస్టిస్‌ సి.హరిశంకర్‌ల ధర్మాసనం మంగ‌ళ‌వారం విచార‌ణ చేప‌ట్టింది. ఈ విచార‌ణ సంద‌ర్బంలో పలు కీలక వ్యాఖ్యలు చేసింది. 

ఒక స్త్రీ పెళ్లి చేసుకున్నంత మాత్రనా.. త‌న హ‌క్కుల‌ను కోల్పోతుందా? భర్త బలవంతంగా లైంగిక చర్యకు పాల్పడినా స‌మ్మ‌తించాలా ? మహిళ కేవలం ఇతర సివిల్‌, క్రిమినల్‌ చట్టాలనే ఆశ్రయించాలా? భారత శిక్షాస్మృతి(ఐపీసీ)- 375 (అత్యాచారం) సెక్షన్ వ‌ర్తించదా? అనే ప‌లు వాదానాలు వినిపించాయి. ఈ వాదనాలు విన్న హైకోర్టు..  IPC యొక్క సెక్షన్ 375 (రేప్) కింద కాకుండా.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 (చట్టం ముందు సమానత్వం) అలాగే ఆర్టికల్ 21 (జీవితానికి మరియు వ్యక్తిగత స్వేచ్ఛకు రక్షణ) లను ఉల్లంఘించేలా ఉన్నాయా అన్నది పరిశీలించాల్సిన అవసరం ధర్మాసనానికి ఉందని పేర్కొంది. 50 దేశాల్లో వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణిస్తున్న సంగతిని గుర్తుచేసింది.

వివాహిత మహిళకు వ్యక్తిగత చట్టాల ప్రకారం.. క్రూరత్వానికి సంబంధించి విడాకులు తీసుకునే అవకాశం ఉందని, అలాగే ఆమె తన భర్తపై IPC సెక్షన్ 498A (వివాహిత మహిళ పట్ల క్రూరత్వం) కింద క్రిమినల్ కేసు నమోదు చేయవచ్చని ఢిల్లీ ప్రభుత్వం తరఫు న్యాయవాది నందిత రావ్‌ మాత్రం భర్తలకు ప్రస్తుతం ఉన్న మినహాయింపులను రద్దు చేయాల్సిన అవసరం లేదని వాదించారు.  

PREV
click me!

Recommended Stories

Nitin Nabin Assets Full Details | Nitin Nabin 2025 Election | Loans, Property | Asianet News Telugu
సొంతూళ్లోనే ఉంటూ రోజుకు రూ.6-7 వేల సంపాదన.. ఓ మహిళ సక్సెస్ స్టోరీ