అఫైర్ అనుమానం: భార్య జననాంగాన్ని కుట్టేసిన వ్యక్తి అరెస్టు

Published : Mar 22, 2021, 01:34 PM IST
అఫైర్ అనుమానం: భార్య జననాంగాన్ని కుట్టేసిన వ్యక్తి అరెస్టు

సారాంశం

మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానంతో భార్య జననాంగానికి కుట్లు వేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు శీల పరీక్ష అంటూ అతను ఆమె చేతులూ కాళ్లూ కట్టేసి యోనికి కుట్లు వేశాడు.

లక్నో: అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానంతో భార్య జననాంగాన్ని అల్యూమినియం తాడుతో కుట్టేసిన వ్యక్తిని పోలీసులు ఢిల్లీలో అరెస్టు చేశారు. భార్యపై అనుమానంతోనే తాను జననాంగాన్ని కుట్టిసినట్లు అతను అంగీరించాడు.  

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణమైన, దిగ్భ్రాంతికరమైన సంఘటన చోటు చేసుకున్న విషయం తెలసిందే. తన భార్య మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని భర్త అనుమానించాడు. దాంతో ఆమె జననాంగానికి కుట్లు వేశాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో రాంపూర్ జిల్లాలో శనివారంనాడు వెలుగు చూసింది. 

వృత్తిరీత్యా డ్రైవర్ అయిన వ్యక్తి  శీల పరీక్ష చేసుకోవాలని తన భార్యను అడిగాడు. ఆమె అందుకు అంగీకరించింది. ఆమె కాళ్లూ చేతులూ కట్టేసి అల్యూమినియం దారంతో ఆమె యోనికి కుట్లు వేశాడు. 

దాంతో ఆమెకు విపరీతమైన రక్తస్రావం జరుగుతూ వచ్చింది. దాంతో అతను అక్కడి నుంచి పారిపోయాడు. ఆ క్రూరమైన చర్య గురించి 24 ఏళ్ల ఆ మహిళ తన తల్లికి చెప్పింది. దాంతో పక్క గ్రామంలోనే తల్లి ఉంటుంది. వెంటనే ఆమె కూతురిని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు తీసుకుని వెళ్లిది. ఆ తర్వాత అల్లుడిపై మాలిక పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. 

పోలీసుల విజ్ఞప్తి మేరకు మహిళకు వైద్యులు పరీక్షలు నిర్వహించారు. రాంపూర్ లోని జిల్లా ఆస్పత్రిలో వైద్యుల బృందం పరీక్షలు నిర్వహించింది. 

PREV
click me!

Recommended Stories

Tamilnadu Incidnt : నిందితుడికి రెండు మరణశిక్షలు | Asianet News Telugu
Coimbatore Child Case: 10 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగితే జోకులేంటి... సస్పెండ్ చేసిన సీఎం విజయ్