సుప్రీం కోర్టులో ఆప్ ఎంపీకి ఎదురుదెబ్బ.. బేషరతుగా క్షమాపణలంటూ సీజేఐ ఆదేశం.. 

By Rajesh Karampoori  |  First Published Nov 3, 2023, 4:31 PM IST

ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దాకు సుప్రీం కోర్టు షాక్ ఇచ్చింది.  సెలెక్ట్ కమిటీ వ్యవహారంలో పార్లమెంట్ నుంచి సస్పెన్షన్ ఎదుర్కొంటున్న ఆప్ ఎంపీకి కోర్టు కీలక సూచనలు చేసింది.  


ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దాకు సుప్రీంకోర్టు లో ఎదురుదెబ్బ తగిలింది. రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధంఖర్‌కు క్షమాపణలు చెప్పాలని ఎంపీ రాఘవ్ చద్దాను సుప్రీంకోర్టు ఆదేశించింది. సభకు అంతరాయం కలిగించినందుకు చైర్మన్‌కు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది.

రాఘవ్ చద్దా కేసును విచారించిన సుప్రీంకోర్టు.. విచారణ ప్రారంభం కాగానే చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ మాట్లాడుతూ.. 'మీరు బేషరతుగా క్షమాపణ చెప్పాలి, మీరు చైర్మన్‌ అపాయింట్‌మెంట్ తీసుకుని ఆయనను కలిస్తే బాగుంటుంది. వారి సౌలభ్యం ప్రకారం.. మీరు వారి ఇల్లు, కార్యాలయం లేదా ఇంట్లో క్షమాపణలు చెప్పవచ్చు.

Latest Videos

ఎందుకంటే ఇది సభ, ఉప రాష్ట్రపతి , రాజ్యసభ ఛైర్మన్ గౌరవానికి సంబంధించిన విషయమని రాఘవ్ చద్దాకు సుప్రీం చీఫ్ జస్టిస్ సూచించారు.ఈ చర్యను చైర్మన్ సానుభూతితో పరిగణించాలని, విచారణ సమయంలో రెండు పక్షాలు ముందుకు వెళ్లే మార్గాన్ని కొనుగొనడానికి ప్రయత్నించాలని భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ తెలిపారు. 

రాఘవ్ రాజ్యసభలో అత్యంత పిన్న వయస్కుడని, క్షమాపణలు చెప్పడం వల్ల ఎలాంటి నష్టం లేదని రాఘవ్ తరపు న్యాయవాది షాదన్ ఫరాసత్ తెలిపారు. గతంలో కూడా క్షమాపణలు చెప్పారు. రాఘవ్ వీలయినంత త్వరగా ఇవన్నీ చేయాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అన్నారు. రాఘవ్‌పై సస్పెన్షన్‌ ప్రతిపాదనను సభ మొత్తం ఆమోదించిందని, అయితే చైర్మన్‌ తన స్థాయిలో దానిని రద్దు చేయవచ్చని షాదన్‌ చెప్పారు. ఈ క్రమంలో సీజేఐ మాట్లాడుతూ.. చైర్మన్( ఉపరాష్ట్రపతి) దీనిని సానుభూతితో పరిశీలించవచ్చని సీజేఐ తెలిపారు. ఉపరాష్ట్రపతి ఇప్పుడే బయటకు వెళ్లారని ఎస్‌జీ మెహతా తెలిపారు. దీపావళి తర్వాత చైర్మన్‌తో సమావేశం కావచ్చు.

గత విచారణలో చద్దా తరపు న్యాయవాది కోర్టులో మాట్లాడుతూ.. సభలో విచారం వ్యక్తం చేయడంతోపాటు క్షమాపణలు కూడా చెప్పారు. సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగించినందుకు గరిష్టంగా మొత్తం సెషన్‌ను సస్పెండ్ చేయవచ్చని, అంతకు మించి ఉండదని ఈ కోర్టు గతంలో కూడా ఒక తీర్పులో చెప్పిందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. నిజానికి రాజ్యసభ నుంచి తనను సస్పెండ్ చేయాలంటూ రాఘవ్ చద్దా సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. అంతకుముందు, విచారణ సందర్భంగా చద్దాపై సస్పెన్షన్ ప్రతిపాదనను మొత్తం సభ ఆమోదించినందున ఏ నిబంధనల ప్రకారం విచారణ నిర్వహిస్తారని కోర్టు ప్రశ్నించింది. ఈ కేసు తదుపరి విచారణ నవంబర్ 20కి వాయిదా పడింది. 

click me!