వీవీప్యాట్లపై సీఈసీని ప్రశ్నించిన సుప్రీం

By narsimha lodeFirst Published Mar 25, 2019, 4:27 PM IST
Highlights

పోలింగ్ తర్వాత వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపును ఎందుకు పెంచలేదని కేంద్ర ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.

న్యూఢిల్లీ: పోలింగ్ తర్వాత వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపును ఎందుకు పెంచలేదని కేంద్ర ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.

21 రాజకీయ పార్టీలు  దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం నాడు సుప్రీంకోర్టు ధర్మాసనం విచారించింది.ఈసీ తీరుపై సుప్రీంకోర్టు అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక్క ఈవీఎంలోని వీవీప్యాట్‌ స్లిప్పులతో లెక్కించి సరిచూస్తున్నారు.  వీవీప్యాట్‌ల లెక్కింపును ఎందుకు పెంచడం లేదో చెప్పాలని సుప్రీంకోర్టు ఈసీని ప్రశ్నించింది.

 ఈసీ తరఫున  సుదీప్‌ జైన్ కోర్టుకు హాజరయ్యారు. ప్రత్యేక కారణాలతోనే వీవీప్యాట్‌లను లెక్కించడం లేదని ఆయన కోర్టుకు వివరించారు. అయితే ఇదే విషయమై అఫిడవిట్‌ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఈసీని కోరింది.

వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపులో ఈసీకి ఉన్న ఇబ్బందులను తెలుపుతూ   ఈ నెల 28వ తేదీ లోపుగా అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఈసీని ఆదేశించింది.ఒకవేళ ప్రస్తుతం కొనసాగుతున్న ప్రక్రియ వల్లే సంతృప్తిగా ఉంటే కారణాలను వివరించాలని కోరుతూ వివరాలు ఇవ్వాలని కోర్టు కోరింది. ఈ కేసు విచారణను ఏప్రిల్ 1వ తేదీకి వాయిదా వేసింది.

click me!