భీమా కోరేగావ్ కేసులో వరవరరావుకు బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్టు

Published : Aug 10, 2022, 01:14 PM IST
భీమా కోరేగావ్ కేసులో వరవరరావుకు బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్టు

సారాంశం

భీమా కోరేగావ్ కేసులో విరసం నేత వరవరరావుకు సుప్రీం కోర్టు బుధవారం రెగ్యులర్ బెయిల్ చేసింది. వరవరరావు మెడికల్ గ్రౌండ్స్ మీద జస్టిస్‌ యూయూ లలిత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది.

భీమా కోరేగావ్ కేసులో విరసం నేత వరవరరావుకు సుప్రీం కోర్టు బుధవారం రెగ్యులర్ బెయిల్ చేసింది. వరవరరావు మెడికల్ గ్రౌండ్స్ మీద జస్టిస్‌ యూయూ లలిత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది. అనారోగ్య కారణాలతో తనకు శాశ్వత బెయిల్‌ మంజూరు చేయాలని వరవర రావు సుప్రీం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సుప్రీం ధర్మాసనం వరవర రావు పిటిషన్‌పై పలుమార్లు విచారణ చేపట్టింది. తాజాగా ఆయనకు నేడు ఆయనకు రెగ్యుర్ బెయిల్‌ మంజూరు చేసింది. అయితే ఈ సందర్భంగా ధర్మాసనం కొన్ని షరతులు విధించింది. కేసు పెండింగ్‌లో ఉన్న ట్రయల్ కోర్టు అధికార పరిధి దాటి వెళ్లకూడదని తెలిపింది. అలాగే బెయిల్ స్వేచ్ఛను దుర్వినియోగం చేయరాదని తెలిపింది. 

సాక్షులతో సంబంధాలు పెట్టుకోవద్దని, కేసు దర్యాప్తును ప్రభావితం చేసేందుకు ప్రయత్నించవద్దని ధర్మాసనం ఈ సందర్భంగా స్పష్టం చేసింది. ఆయన వైద్య చికిత్స వివరాలను ఎన్‌ఐఏకు అందించాలని కోర్టు ఆదేశించింది.

ఇక, భీమా కోరెగావ్ కేసులో 2018 ఆగస్టు 28న వరవరరావును హైదరాబాద్‌లోని ఆయన ఇంటి నుంచి అరెస్ట్ చేశారు. ఆ కేసులో విచారిస్తున్నారు. వరవరరావుపై చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం, ఐసీపీలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు వరవరరావును తొలుత గృహనిర్బంధంలో ఉంచారు. అయితే 2018 నవంబర్‌లో పోలీసు కస్టడీలోకి తీసుకుని తలోజా జైలుకు తరలించారు.

అయితే వరవర రావు‌కు వైద్య కారణాలతో బాంబే హైకోర్టు మధ్యంతర బెయిల్‌పై ఉన్నారు. అయితే తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న తనకు పర్మినెంట్ మెడికల్ బెయిల్ ఇవ్వాలని వరవరరావు చేసిన విజ్ఞప్తిని బాంబే హైకోర్టు ఈ ఏడాది ఏప్రిల్ 13న తిరస్కరించింది. అయితే బాంబే హైకోర్టు ఆదేశాలను వరవరరావు సుప్రీం కోర్టులో సవాలు చేశారు. ఈ క్రమంలోనే సుప్రీం కోర్టులో పలుమార్లు విచారణ జరిగింది. ఆ సమయంలో ఆయన మధ్యంతర బెయిల్‌ను తదుపరి ఆదేశాల వరకు పొడగిస్తూ వచ్చింది. అయితే తాజాగా సుప్రీం కోర్టు.. వరవర రావుకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. 
 

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?