ఒలంపిక్స్‌లో క్రీడాకారులు విజయంతో తిరిగి రావాలి: మన్‌కీబాత్‌లో మోడీ

By narsimha lodeFirst Published Jul 25, 2021, 4:18 PM IST
Highlights

మన్‌కీ బాత్ కార్యక్రమంలో భాగంగా ప్రధాని మోడీ ఆదివారం నాడు ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఒలంపిక్స్ లో పాల్గొన్న ప్రతి ఒక్క క్రీడాకారుడు విజయంతో తిరిగి రావాలని ఆయన ఆకాంక్షను వ్యక్తం చేశారు.

న్యూఢిల్లీ: ఒలంపిక్స్ లో ఆడుతున్న ఇండియన్ క్రీడాకరులు విజయంతో  తిరిగి రావాలని ప్రధాని నరేంద్ర మోడీ  ఆకాంక్షించారు.ఆదివారం నాడు మన్‌కీ బాత్ కార్యక్రమంలో ఆయన దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఒలంపిక్స్ లో పాల్గొంటున్న భారత క్రీడాకారులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. క్రీడాకారులకు మద్దతుగా సామాజిక మాధ్యమాల్లో ప్రారంభమైన  హమారా విక్టరీ పంచ్ ద్వారా ప్రతి ఒక్క ఆటగాడికి అండగా నిలవాలని ఆయన కోరారు.

జూలై 26న కార్గిల్ విజయ్ దివస్ ను పురస్కరించుకొని సైనికుల త్యాగాలను మోడీ గుర్తు చేశారు.భారత సైనికుల ధీరత్వాన్ని  సంయమనాన్ని యావత్ ప్రపంచం కార్గిల్ యుద్దం సమయంలో వీక్షించిందన్నారు.దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75వ వసంతం రాబోతోందన్నారు. దీన్ని పురస్కరించుకొని ఈ ఏడాది మార్చి 12న ప్రారంభమైన గాంధీ సబర్మతి ఆశ్రమం నుండి అమృత్ మహోత్సవ్ ప్రారంభించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.ఆగష్టు 7న జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని చేనేత కార్మికుల కృషిని ప్రధాని ప్రశంసించారు. చేనేత వస్త్రాలు కొని ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని ఆయన కోరారు. వైవిధ్యమైన సంస్కృతిగల భారత్ లో ప్రతి ఒక్కరూ ఐకమత్యంగా ఉండాలని ప్రధాని కోరారు.
 

click me!