నెహ్రుపై సుబ్రమణ్యస్వామి సంచలన వ్యాఖ్యలు

Published : May 09, 2019, 11:53 AM IST
నెహ్రుపై సుబ్రమణ్యస్వామి సంచలన వ్యాఖ్యలు

సారాంశం

భారత తొలి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రుపై  బీజేపీ నేత, ఎంపీ సుబ్రమణ్యస్వామి సంచలన ఆరోపణలు చేశారు నెహ్రు తన యూరప్ భార్యల్లో ఒకరికి వైమానిక దళ విమానం కావాలని కోరుకొన్నారని ఆయన ఆరోపించారు.


న్యూఢిల్లీ:  భారత తొలి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రుపై  బీజేపీ నేత, ఎంపీ సుబ్రమణ్యస్వామి సంచలన ఆరోపణలు చేశారు నెహ్రు తన యూరప్ భార్యల్లో ఒకరికి వైమానిక దళ విమానం కావాలని కోరుకొన్నారని ఆయన ఆరోపించారు.

తన యూరప్ భార్య కోసం ఎయిర్‌ఫోర్స్ విమానాన్ని సమకూర్చాలని 1950లో రక్షణ కార్యదర్శిగా ఉన్న తమ మామ జేడీ కపాడియాను నెహ్రు కోరితే ఆందుకు ఆయన నిరాకరించినట్టుగా ఆయన గుర్తు చేశారు.  దీంతో ఆయనను ఆ స్థానం నుండి బదిలీ చేసి తదుపరి కార్యదర్శితో తన పని చక్కబెట్టుకొన్నారని నెహ్రుపై సుబ్రమణ్యస్వామి ఆరోపించారు.

ఎన్నికలు జరుగుతున్న సమయంలో  రాహుల్‌తో పాటు  కాంగ్రెస్ పార్టీపై బీజేపీ తన దాడిని తీవ్రం చేసింది.  రాజీవ్ ప్రధానిగా ఉన్న సమయంలో ఐఎన్ఎస్ విరాట్‌ను గాంధీ కుటుంబం తన వ్యక్తిగత ట్యాక్సీగా  వాడుకొందని మోడీ విమర్శించిన విషయం తెలిసిందే. ఈ విమర్శలు చేసిన సమయంలోనే సుబ్రమణ్యస్వామి ఈ ట్వీట్ చేయడం ప్రాధాన్యత సంతరించుకొంది.
 

PREV
click me!

Recommended Stories

DAIS : ఐశ్వర్యారాయ్ కూతురు చదివే ధీరూభాయ్ అంబానీ స్కూల్ ఫీజు ఎంత?
ఆకాష్, అనంత్ అంబానీలు తెలుసు... మరి ఎవరీ జై అన్మోల్ అంబానీ?