మహిళా ఎస్సై ఆత్మహత్య.. సూసైడ్ నోట్ లో ఏముందంటే..

Bukka Sumabala   | Asianet News
Published : Jan 02, 2021, 04:35 PM IST
మహిళా ఎస్సై ఆత్మహత్య.. సూసైడ్ నోట్ లో ఏముందంటే..

సారాంశం

యువ మహిళా ఎస్సై ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఉత్తరప్రదేశ్ లో కలకలం రేపింది. ఈ విషాదకర ఘటనలో ఆమె ఎందుకు చనిపోయిందన్న దానిమీద పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తన మరణానికి ఎవ్వరూ కారణం కాదని సూసైడ్ నోట్ రాసి పెట్టడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 

వివరాల్లోకి వెడితే.. బులంద్‌షహర్‌ జిల్లాలోని అనూప్‌షహర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఆర్జూ పవార్‌(30) ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్నారు. స్థానికంగా ఓ ఇంట్లో ఒంటరిగా అద్దెకు ఉంటుంది. శుక్రవారం నాడు తాను అద్దెకు ఉంటున్న ఇంట్లో ఉరికి వేలాడుతూ కనిపించారు.

చాలా సేపటి నుంచి ఆర్జూ అలికిడి వినిపించకపోవడంతో ఇంటి యజమానురాలికి అనుమానం వచ్చి తలుపులు తెరచి చూడగా విషయం బయటపడింది. ఆమె ఇచ్చిన సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు పంచనామా నిర్వహించారు. ఆస్పత్రికి తరలించగా ఆర్జూ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. 

కాగా ఘటనాస్థలంలో లభించిన సూసైడ్‌నోట్‌లో.. తన చావుకు తానే కారణమని ఆర్జూ పేర్కొన్నట్లు రాసి ఉందని పోలీసులు వెల్లడించారు. మృతురాలి కుటుంబ సభ్యులతో పాటు ఆమె సన్నిహితులను కూడా విచారిస్తున్నామని, అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

PREV
click me!

Recommended Stories

IRCTC New Rates: టికెట్ ధరలు పెంచిన రైల్వే.. హైదరాబాద్ నుంచి వైజాగ్, తిరుపతికి రేట్లు ఇవే !
Success Story: సెక్యూరిటీ గార్డు కొడుకు.. 3 కంపెనీలకు బాస్ ! ఇది కదా సక్సెస్ స్టోరీ అంటే !