తనపై లైంగిక ఆరోపణలు చేసిన మహిళనే పెళ్లాడిన ప్రభుత్వాధికారి

Published : Oct 13, 2019, 06:30 PM ISTUpdated : Oct 13, 2019, 06:34 PM IST
తనపై లైంగిక ఆరోపణలు చేసిన మహిళనే పెళ్లాడిన ప్రభుత్వాధికారి

సారాంశం

ప్రభుత్వాధికారిపై లైంగిక ఆరోపణలు చేసిన మహిళనే సదరు అధికారి పెళ్లాడిన ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఖుషినగర్ లో చోటు చేసుకుంది. శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ వివాహానికి సంబంధించిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

లక్నో: ప్రభుత్వాధికారిపై లైంగిక ఆరోపణలు చేసిన మహిళనే సదరు అధికారి పెళ్లాడిన ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఖుషినగర్ లో చోటు చేసుకుంది. శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ వివాహానికి సంబంధించిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

వివరాల్లోకి వెళితే, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హాపూర్ సుబ డివిజనల్ మెజిస్ట్రేట్ గా విధులు నిర్వర్తిస్తున్న దినేష్ కుమార్ అనే వ్యక్తిపై ఓ మహిళ గత కొన్ని రోజులుగా లైంగిక ఆరోపణలు చేస్తుంది. పెళ్లి చేసుకుంటానని చెప్పి లైంగిక సంబంధం పెట్టుకున్నాడని, పెళ్ళాడమంటే రేపు మాపు అంటూ కాలం వెళ్లదీస్తున్నాడని సదరు యువతి ఆరోపించింది. 

ఈ నేపథ్యంలో పెద్ద హోదాలో ఉన్న అధికారి శుక్రవారం సాయంత్రం సదరు యువతిని పెళ్లిచేసుకున్నాడు. ఖుషి నగర్ లోని గాయత్రి మాత గుడిలో వీరిరువురి వివాహం అగ్నిసాక్షిగా జరిగింది. ఈ వివాహం జరిగినట్టు జిల్లా అధికారులు కూడా ధృవీకరించారు. 

PREV
click me!

Recommended Stories

Bank Jobs : మంచి మార్కులుండి, తెలుగులో మాట్లాడితే చాలు.. రాత పరీక్ష లేకుండానే బ్యాంక్ జాబ్స్
Budget Friendly Cars : కొత్తగా జాబ్ లో చేరినవారు కూడా కొనగలిగే టాప్ 5 కార్లు ఇవే..