టీచర్ తో విద్యార్థులు తాము తెచ్చుకున్న భోజనాన్ని షేర్ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
న్యూఢిల్లీ: తమ వెంట తెచ్చుకున్న ఆహారాన్ని టీచర్ తో పంచుకున్నారు చిన్నారులు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గామారింది.ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేసిన వెంటనే వేలాది మంది ఈ వీడియోను వీక్షించారు. ఇన్ స్టాగ్రామ్ లో ఈ వీడియోను పోస్టు చేసిన తర్వాత ఈ వీడియోను సుమారు 10 మిలియన్ల మంది వీక్షించారు.
అవినాష్ అనే నెటిజన్ ఈ వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేశారు. కొందరు విద్యార్థులు తమతో తెచ్చుకున్న ఆహారాన్ని టీచర్ కు అందిస్తున్న దృశ్యాలు ఈ వీడియోలో ఉన్నాయి. విద్యార్థులు అందించిన ఆహారం తీసుకుంటూ టీచర్ వారికి ధన్యవాదాలు చెప్పారు.
టీచర్, విద్యార్థుల మధ్య ఆప్యాయతను తెలుపుతుందని ఓ నెటిజన్ వ్యాఖ్యానించారు.చిన్నారులు స్కూల్లో భోజనం చేసేందుకు వీలుగా బాక్సులను పంపారు వారి తల్లులు. ఓ రోటీని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి బాక్సులో పెట్టారు ఓ తల్లి. మరో చిన్నారి బాక్సులో కూరతో కలిపిన ఆహారాన్ని బాక్సులో ఉంచారు. మరో బాక్సులో పెరుగన్నం కలిపి పంపారు.
ఈ వీడియో చూసి ఓ నెటిజన్ ఇలా వ్యాఖ్యానించారు. తన గురువు తాను తీసుకెళ్లిన మధ్యాహ్న భోజనం తిన్నప్పుడు తాను చాలా గర్వంగా భావించినట్టుగా ఓ నెటిజన్ గుర్తు చేసుకున్నారు. తాను ప్రైమరీ టీచర్ కావడానికి కూడ కారణమిదేనని ఆ నెటిజన్ వ్యాఖ్యానించారు.