రిపబ్లిక్ డే... రాజ్‌పథ్‌లో ఏషియానెట్ న్యూస్ ‘‘ ప్రౌడ్ టు బి యాన్ ఇండియన్ ’’ విద్యార్ధుల బృందం

By Siva KodatiFirst Published Jan 26, 2023, 9:13 PM IST
Highlights

గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని రాజ్‌పథ్‌లో జరిగిన రిపబ్లిక్ డే వేడుకల్లో ఏషియానెట్ న్యూస్ ‘‘ ప్రౌడ్ టు బి యాన్ ఇండియన్ ’’ విద్యార్ధుల బృందం సందడి చేసింది. యుధ దళాల కవాతాను గమనించిన పిల్లలు తాము కూడా సైన్యంలో చేరాలని అనుకుంటున్నట్లు చెప్పారు. 

గణతంత్ర దినోత్సవం సందర్భంగా విద్యార్ధుల కోరికను నెరవేర్చి వారి కళ్లలో ఆనందం చూసింది ఏషియానెట్ న్యూస్. ఢిల్లీలోని రాజ్‌పథ్‌లో రిపబ్లిక్ డే పరేడ్ ప్రత్యక్షంగా చూడాలని తమ కల.. దీనిని చూస్తున్నందుకు ఎంతో ఆనందంగా వుందని విద్యార్ధులు ఏషియానెట్ న్యూస్‌తో అన్నారు. సాయుధ దళాల కవాతాను గమనించిన పిల్లలు తాము కూడా సైన్యంలో చేరాలని అనుకుంటున్నట్లు చెప్పారు. 

బుధవారం రాత్రి ఢిల్లీలోని ఇందిరాగాంధీ విమానాశ్రయానికి చేరుకున్న ప్రతినిధి బృందానికి ఢిల్లీ మలయాళీ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ టోనీ కన్నంపూజా , తదితరులు ఘన స్వాగతం పలికారు. ఢిల్లీలో రిపబ్లిక్ డే పరేడ్ చూసేందుకు గాను 2500 మంది పోటీపడగా.. 50 మంది విద్యార్ధులు, ఉపాధ్యాయులతో కూడిన బృందాన్ని నెలరోజుల పాటు శ్రమించి ఎంపిక చేశారు. 

విద్యార్ధులు , ఉపాధ్యాయులతో కూడిన బృందం రెండు రోజుల పాటు హిమాచల్ ప్రదేశ్‌లోని చారిత్రక ప్రదేశాలను వీక్షించనుంది. అనంతరం ఆదివారానికి తిరిగి ఢిల్లీ చేరుకుని.. రిపబ్లిక్ డే వేడుకల ముగింపు అయిన బీటింగ్ ది రిట్రీట్ ప్రోగ్రామ్‌ను తిలకించనుంది.తర్వాత సోమవారం రాజ్‌ఘాట్‌లో మహాత్మా గాంధీ స్మారక దినోత్సవ కార్యక్రమంలో కూడా పాల్గొని బృందం తిరిగి రానుంది. 

ఇదిలావుండగా.. ఈసారి డి మోంట్‌ఫోర్ట్ యూనివర్సిటీ ప్రవేశ పరీక్ష దుబాయ్‌‌లో జరిగింది. దీనిలో భారతీయ చరిత్ర, కరెంట్ అఫైర్స్ , జనరల్ నాలెడ్జ్ ఆధారంగా ప్రశ్నలు వచ్చాయి. పరీక్ష ముగిసినప గంటలోపే విజేతలను ప్రకటించారు. గెలుపొందిన విద్యార్ధులకు ఏషియానెట్ న్యూస్ గ్రూప్ మేనేజింగ్ ఎడిటర్ మనోజ్ కె దాస్ జాతీయ జెండాను అందజేశారు. 

దుబాయ్‌లోని భారత కాన్సులేట్‌లో జరిగిన కార్యక్రమంలో కాలన్సుల్ జనరల్ డాక్టర్ అమన్ పూరి యాత్రను ప్రారంభించారు. ఏషియానెట్ న్యూస్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ రాజేశ్ కల్రాకు కాన్సుల్ జనరల్ భారత జాతీయ పతాకాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రాజేశ్ కల్రా మాట్లాడుతూ .. గణతంత్ర దినోత్సవ పరేడ్‌ను ప్రత్యక్షంగా చూడలేకపోయినా టీవీలో చూడాలని అన్నారు. 

గడిచిన సంవత్సరాలతో పోల్చితే ఈసారి ప్రాంతీయ క్వీజ్ పోటీల ద్వారా ‘‘Proud to be an Indian team ’’కు విద్యార్ధులను ఎంపిక చేశారు. ప్రాంతీయ క్విజ్ పోటీలు దుబాయ్, షార్జా, రస్ అల్ ఖైమాలలో జరిగాయి. 2013లో "ప్రౌడ్ టు బి ఏ ఇండియన్" ప్రారంభమవ్వగా.. ఇది తొమ్మిదవ ఎడిషన్. ఇందులో ఎంపికైన వారి ప్రయాణ ఖర్చులను పూర్తిగా ఏషియానెట్ న్యూస్ భరిస్తుంది. కోవిడ్ కారణంగా రెండేళ్ల విరామం తర్వాత "ప్రౌడ్ టు బి ఏ ఇండియన్" కార్యక్రమం నిర్వహించారు. 

 

click me!