
నీటిలో రాయి వేస్తే ఏమౌతుంది..? ఇంకేమౌతుంది.. నీటిలో మునిగిపోతుంది. ఈ విషయం చిన్న పిల్లాడికి కూడా తెలుసు. అయితే...ఓ గ్రామంలో మాత్రం రాయి.. నీటిలో మునగలేదు. తేలుతూ కనిపించింది. ఒకవేళ అదేమైనా రాయిలాగా కనిపిస్తున్న ఇంకేదైనా వస్తువా అనే సందేహం కూడా కలిగింది. అది కూడా పరీక్షించారు. కానీ అది నిజంగా రాయి. బరువు కూడా ఎక్కువగానే ఉండటం గమనార్హం. అయినా కూడా నీళ్లలో తేలుతోంది. దీనికి సంబంధించిన వీడియో కూడా ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఈ రాయి రామ సేతుకు సంబంధించిందటూ అందరూ కామెంట్స్ చేస్తుండటం గమనార్హం. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మనిపూర్ గ్రామంలోని నీటిలో ఓ రాయి తేలుతూ కనిపించింది. తొలుత దీనిని చూసి పిల్లలు బయపడ్డారు. తర్వాత ఈ విషయాన్ని గ్రామస్థులకు తెలియజేశారు. రాయి నీటిలో తేలుతుండగా షేర్ చేయగా.. ఇది కాస్త వైరల్ గా మారింది. ఆ రాయి నీటిలో అసలు మునగడం లేదు. ముంచాలనిచూసినా మునగకపోవడం గమనార్హం. దాని బరువు 5.7 కేజీల ఉండటం గమనార్హం.
గ్రామానికి చెందిన చిన్నారులు చేపలు పట్టుకుందామని వెళ్లగా.. ఈ రాయి కనపడింది. జులై 30వ తేదీన వారికి ఈ రాయి కనిపించడం గమనార్హం. ఆ రాయి రామసేతుకు చెందినదిగా గ్రామస్షులు భావిస్తున్నారు. రాముని కాలంలో.. శ్రీరాముడు సముద్రాన్ని దాటడానికి.. రామ సేతు రాళ్లను తీసుకువచ్చి వంతెన నిర్మించారు అని పురాణాలు చెబుతున్నాయి. ఆ రాళ్లు.. నీటిపై తేలుతూ ఉండటం వల్ల.. రాముడు వాటిపై నడుచుకుంటూ సముద్రాన్ని దాటాడు అని చెబుతుంటారు. ఈ రాయి కూడా.. ఆ రాము సేతు నిర్మించిన వంతెనకు సంబంధించినదేనని ఇప్పుడు గ్రామస్థులు నమ్ముతున్నారు. ఈ రాయిని గుడిలో నిర్మించాలని అనుకుంటున్నట్లు గ్రామస్థులు చెబుతున్నారు.