దొంగతనం జరిగిన 22 యేళ్లకు దొరికిన బంగారం.. విలువెంతో తెలిస్తే కళ్లు తేలేస్తారు....

Published : Feb 01, 2022, 02:14 PM IST
దొంగతనం జరిగిన 22 యేళ్లకు దొరికిన బంగారం.. విలువెంతో తెలిస్తే కళ్లు తేలేస్తారు....

సారాంశం

కోలాబాలో నివసించే అర్జున్ దాస్వామీ ఇంట్లో 1998, మే 8న అంటే సుమారు 22 యేళ్ల క్రితం దొంగతనం జరిగింది. ఇంట్లోకి చొరబడిన దుండగులు యజమానికి, అతని భార్యను బంధించి, బంగారు ఆభరణాలు, పాత బంగారు నాణేలను అపహరించారు. అప్పట్లో వాటి విలువ దాదాపు రూ. 13 లక్సలు కాగా, ఇప్పుడు దాదాపు రూ. 8 కోట్ల విలువ ఉంటుంది. 

ముంబయి :  ఈ రోజుల్లో దొంగతనాలు కూడా సర్వ సాధారణం అయిపోయాయి. ఐతే దొంగిలించబడిన వస్తువులు దొరకడం మాత్రం అసాధారణంగా మారిపోయింది. అదీ నిన్నా, మొన్నా జరిగిన దొంగతనం కాదు. ఏకంగా 22 యేళ్ల క్రితం ఓ ఇంట్లో thiefలు పడి బంగారంతో పాటు, విలువైన వస్తువులను అన్నింటినీ దోచుకెళ్లారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు కూడా. ఇక సొత్తు దొరకదులే అని ఆశలు వదిలేసుకుంటున్న సమయంలో అనుకోకుండా అప్పుడెప్పుడో పోగొట్టుకున్న వస్తువులన్నీ తిరిగి పొందగలిగింది ఆ కుటుంబం. అదెలా జరిగిందంటే..

mumbaiలో చోటు చేసుకున్న ఈ షాకింగ్ సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. కోలాబాలో నివసించే అర్జున్ దాస్వామీ ఇంట్లో 1998, మే 8న అంటే సుమారు 22 యేళ్ల క్రితం దొంగతనం జరిగింది. ఇంట్లోకి చొరబడిన దుండగులు యజమానికి, అతని భార్యను బంధించి, బంగారు ఆభరణాలు, పాత బంగారు నాణేలను అపహరించారు. అప్పట్లో వాటి విలువ దాదాపు రూ. 13 లక్సలు కాగా, ఇప్పుడు దాదాపు రూ. 8 కోట్ల విలువ ఉంటుంది. 

అప్పటి యజమాని అర్జున్ దాస్వామీ 2007లో మరణించారు. ఆ తర్వాత బంగారం చోరీ కేసును కుటుంబం దాదాపు మరిచిపోయింది. ఈ కేసులో మొత్తం నలగురు నిందితులను పోలీసులు 1998లో అరెస్ట్ చేయగా, ఇద్దరు తప్పించుకున్నారు. మిగిలిన ఇద్దరు నిందితులను పట్టుునే వరకు చోరీకి గురైన వస్తువులను యజమానులకు అప్పగించరాదని కేసు విచారణ సందర్భంగా కోర్టు ఆదేశించిది. ఐతే చోరీకి గురైన బంగారాన్ని యజమానులకు అప్పగించేందుకు గత ఏడాది ముంబయి పోలీసులకు కోర్టు అనుమతినిచ్చింది. కోర్టు ఆదేశాల మేరకు బంగారాన్ని ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్ చిరాగ్ దిన్ యజమానికి పోలీసులు వాపస్ చేశారు. 

ఇదిలా ఉండగా, నిరుడు ఫిబ్రవరిలో పెద్దపల్లి జిల్లా రామగుండం మాల్యాలపల్లి రైల్వేబ్రిడ్జ్ మూల మలుపు వద్ద ఫిబ్రవరి 24న బంగారు వ్యాపారులు ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురయ్యింది. అయితే ఈ ప్రమాదంలో మృత్యువాతపడ్డ వ్యాపారుల వద్ద గల బంగారం ఛోరీకి గురయ్యింది. మృతుల వద్ద 5కిలోల 6వందల గ్రాముల బంగారం ఉండాలని మృతుల బంధువులు చెబుతుండగా ప్రమాదస్థలంలో పోలీసులకు కేవలం మూడున్నర కిలోల బంగారం మాత్రమే లభించింది.  దీంతో పోలీసులు రాకముందే కిలోన్నర బంగారం ఛోరీకి గురయినట్లుంది.

ఈ బంగారం చోరీ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు రామగుండం సిఐ కరుణాకర్ రావు తెలిపారు. మృతదేహాలను, క్షతగాత్రులను హాస్పిటల్ కు తరలించిన అంబులెన్స్ సిబ్బందితో పాటు 108 సిబ్బందిని విచారిస్తున్నట్లు వెల్లడించారు. 

రామగుండం మాల్యాలపల్లి రైల్వేబ్రిడ్జ్  మూల మలుపు వద్ద మంగళవారం తెల్లవారుజామున వేగంగా వెళుతున్న కారు అదుపుతప్పి బోల్తా పడింది.  దీంతో కారులో ప్రయాణిస్తున్న రాంబాబు, శ్రీనివాస్ అనే ఇద్దరు బంగారు వ్యాపారులు మృతి చెందారు. మరో ఇద్దరు వ్యాపారులు సంతోష్ కుమార్, సంతోష్ లు తీవ్రంగా గాయపడగా హాస్పిటల్ కు తరలించారు. 

ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. సంఘటన స్థలంలో  కిలో బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వ్యాపారులు ఆంద్రప్రదేశ్ నరసరావుపేటకు చెందిన వారుగా గుర్తించారు. వీరు బంగారం అమ్మడానికి వస్తున్నట్లు తెలుస్తోంది. అయితే తాజాగా వ్యాపారుల బంధువుల ఫిర్యాదు మేరకు ఛోరీకి గురయిన బంగారం గురించి విచారణ చేపట్టారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

MICE పథకం.. ఈ రంగంలో గేమ్‌ చేంజర్
రైళ్లలో ఇకపై లగేజీకి ఛార్జీలు:Ashwini Vaishnaw on Indian Railway Luggage Rules | Asianet News Telugu