ఒకప్పుడు పబ్ లో పని.. ఇప్పుడు రూ.90 కోట్ల ఆదాయం.. బర్గర్ సింగ్ సక్సెస్ స్టోరీ ఇది..!

By Mahesh Rajamoni  |  First Published Aug 26, 2023, 3:37 PM IST

2014లో బర్గర్ సింగ్ అనే ఫాస్ట్ ఫుడ్ ఎంటర్ ప్రైజ్ ను ప్రారంభించిన కబీర్ జీత్ సింగ్ మెనూలో బర్గర్లు, ఫ్రైస్, సైడ్స్, ఇతర ఆహార పదార్థాలను అందిస్తున్నారు. ఈ సంస్థ రూ.90 కోట్ల వార్షిక ఆదాయంతో మల్టీ సిటీ ఫుడ్ చైన్ గా విస్తరించింది.
 


భారతదేశంలో ప్రసిద్ధ ఫాస్ట్ ఫుడ్ చైన్ అయిన బర్గర్ సింగ్.. మెక్ డొనాల్డ్స్, బర్గర్ కింగ్ వంటి ప్రముఖ బ్రాండ్లకు ప్రత్యర్థిగా మారింది. 98 చదరపు అడుగుల బర్గర్ జాయింట్ గా ప్రారంభమైన ఈ సంస్థ రూ.90 కోట్ల వార్షిక ఆదాయంతో మల్టీ సిటీ ఫుడ్ చైన్ గా విస్తరించింది. 2014లో బర్గర్ సింగ్ అనే ఫాస్ట్ ఫుడ్ ఎంటర్ప్రైజ్ ను కబీర్ జీత్ సింగ్ ప్రారంభించారు.ఈ ఫాస్ట్ ఫుడ్ ఎంటర్ ప్రైజెస్ మెనూలో బర్గర్లు, ఫ్రైస్, సైడ్స్, ఇతర ఆహార పదార్థాలను తయారుచేస్తారు. 

కబీర్ జీత్ సింగ్ ఎవరు?

Latest Videos

కబీర్ జీత్ సింక్ ఆర్మీ కుటుంబానికి చెందిన వాడు. అయితే ఇతని తల్లిదండ్రులు కబీర్ ను భారత సైన్యంలో చూడాలనుకున్నారు. ఈ ఉద్దేశ్యంతోనే కబీర్ జీత్ సింగ్ ను 13 సంవత్సరాల వయస్సులో రెసిడెన్షియల్ ఆర్మీ పబ్లిక్ స్కూల్ కు పంపారు. అక్కడ 12వ తరగతి వరకు చదువుకున్నాడు. బీబీఏ పూర్తయ్యే నాటికి ఆర్మీ జీవితం తాను కోరుకున్నది కాకపోవచ్చునని కబీర్ భావించాడు. తనకు నచ్చిన పనిని చేయాలనుకున్నాడు. అయితే ఇతని కుటుంబం కూడా అతనికి ఎంతో మద్దతునిచ్చింది. అతనికి ఎలాంటి ఆంక్షలు పెట్టలేదు. 

కబీర్ జీత్ సింగ్ ఎంబీఏ చేయడానికి బర్మింగ్హామ్ విశ్వవిద్యాలయంలో చేరాడు. యూకేలో చదువుకుంటున్న సమయంలో రెండు పార్ట్ టైమ్ జాబ్స్ కూడా చేశాడు. పబ్ లో నైట్ షిఫ్ట్, బర్గర్ రెస్టారెంట్ లో ఈవెనింగ్ షిఫ్ట్ లో పనిచేసేవాడు.

undefined

అయితే అవి అంతగా టేస్టీగా ఉండేవి కావు. ముఖ్యంగా అతను కోరుకున్న ఇండియన్ టేస్ట్ లో ఉండేవి కావు. దీంతో అతను కొన్ని రకాల మసాలా దినుసులతో బర్గర్లను తయారుచేశాడు. దీని టేస్ట్ చాలా మందికి నచ్చింది. దీంతో అతను తన బర్గర్లను విశ్వవిద్యాలయ కుక్ అవుట్లలో అమ్మడం ప్రారంభించాడు. ఈ సమయంలో అతను "బర్గర్ సింగ్" అనే మారుపేరును పెట్టుకున్నాడు. కొన్నేళ్లలో ఈ వ్యాపారం భారత్ లో తన ఫ్రాంచైజీ రెస్టారెంట్ పేరుతో విస్తరించింది.

2014లో భారత్ కు తిరిగివచ్చి వ్యాపారాన్ని నిర్వహించే సాంకేతిక పరిజ్ఞానం సంపాదించిన తర్వాత 2008లో గుర్గావ్ లో సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభించారు. కబీర్ మొదట మెటీరియల్ కనిపెట్టడంపై దృష్టి పెట్టాడు. శాకాహారం కోసం ముంబైలోని పన్వేల్ లోని ఓ వ్యాపారితో, మాంసాహారం కోసం హైదరాబాద్ లోని ఓ విక్రేతతో భాగస్వామ్యం కుదుర్చుకున్నాడు.

రూ.30 లక్షలతో తొలి ఔట్ లెట్ ను ప్రారంభించగా ఆ తర్వాత మరో రెండు దుకాణాలను ప్రారంభించారు. అద్దె రూ.60వేలు మాత్రమే ఉండడం అప్పప్పటికే రూ. 10 లక్షల వరకు ఆదాయం సమకూరడంతో చిన్న దుకాణాలు డబ్బు ఆదా చేసుకునే వెసులుబాటు కల్పించాయి.

మింట్ నివేదికల ప్రకారం.. బర్గర్ సింగ్ సుమారు రూ .40 లక్షల పెట్టుబడితో తన వ్యాపారాన్ని ప్రారంభించాడు. అలాగే ఎంతో మంది పెట్టుబడిదారుల నుంచి డబ్బును సంపాదించాడు. 23 ఆర్థిక సంవత్సరంలో అతని ఆదాయం రూ.29.1 కోట్ల నుంచి రూ.90 కోట్లకు పెరిగింది. 100కి పైగా నగరాల్లో 50కు పైగా లొకేషన్లతో కబీర్స్ బర్గర్ సింగ్ దేశంలో మూడో అత్యంత ప్రజాదరణ పొందిన బర్గర్ డెలివరీ స్పాట్ గా నిలిచింది.
 

click me!