హాస్పిటల్ ఐసీయూల్లో భజనలు, పేషెంట్లకు చికిత్స అందించడంలో వైద్యులకు సహాయంగా..

By Mahesh K  |  First Published Oct 6, 2023, 2:50 PM IST

ఒడిశాలోని హాస్పిటల్‌లో ఐసీయూల్లో భజనలను వినిపించాలని నిర్ణయించారు. పేషెంట్లు వేగంగా కోలుకోవడానికి ఇవి ఉపకరిస్తాయని తెలిపారు. మ్యూజిక్ థెరపీలో భాగంగా శ్రావ్యమైన వాయిద్యాల సంగీతంతో భజనలను వినిపిస్తే వారు వేగంగా కోలుకోవడానికి ఉపకరిస్తుందని వివరించారు.
 


న్యూఢిల్లీ: పేషెంట్లకు చికిత్స అందించడంలో వైద్యులకు తోడుగా ఐసీయూల్లో భజనలు ప్లే చేయాలనే ఓ నిర్ణయాన్ని ఒడిశా హాస్పిటల్ తీసుకుంది. ఒడిశాలో కటక్‌లోని ఎస్‌సీబీ మెడికల్ కాలేజీ, హాస్పిటల్ ఈ నిర్ణయాన్ని తీసుకుంది. తమ హాస్పిటల్‌లోని అన్ని ఐసీయూల్లో స్పిరిచువల్ భజనలను ప్లే చేస్తామని తెలిపింది. ఆధ్యాత్మిక భజనలను ప్లే చేయించి మ్యూజిక్ థెరపీ ద్వారా పేషెంట్లకు ఉపశమనం ఇవ్వవచ్చునని ఎస్‌సీబీ మెడికల్ అధికారులు సిఫారసులు చేశారు. క్రిటికల్ పేషెంట్లకు ఈ మ్యూజిక్ థెరపీ ఎంతో ఉపయోగకారిగా ఉంటుందని హాస్పిటల్‌లోని నిపుణులు చెప్పారు.

హాస్పిటల్ అధికారులు బుధవారం ఈ మ్యూజిక్ థెరపీ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. పేషెంట్లకు వేగంగా కోలుకోవడానికి మ్యూజిక్ థెరపీ ఉపకరిస్తుందని వివరించింది. హాస్పిటల్ వైస్ చాన్సిలర్ డాక్టర్ అబినాశ్ రౌత్ మాట్లాడుతూ.. ఐసీయూలో శ్రావ్యమైన సంగీతాన్ని వినిపిస్తే పేషెంట్లు కోలుకోవడానికి దోహదపడుతుందని, ఈ ప్రతిపాదనపై చర్చించిన తర్వాత హాస్పిటల్‌లోని అన్ని ఐసీయూల్లో మ్యూజిక్ ప్లే చేయాలని నిర్ణయం తీసుకున్నామని వివరించారు. ప్రభుత్వ విధానాల ప్రకారం టెండర్‌లకు పిలుపు ఇస్తామని తెలిపారు.

Latest Videos

Also Read: Election Commission: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నగారా! ఈ నెల 8-10వ తేదీల్లో షెడ్యూల్?

మ్యూజికల్ థెరపీ అనేది అసాధారణమేం కాదు. 2020లో కరోనా సమయంలోనూ గుజరాత్‌లోని స్ సాయాజీరావు జనరల్ హాస్పిటల్‌లో మ్యూజిక్ థెరపీ, లాఫ్టర్ థెరపీని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఇదే విధానాన్ని కొంత మార్పు చేసి ఒడిశాలోని హాస్పిటల్‌లో అమలు చేయాలని భావిస్తున్నారు.

click me!