దక్షిణాది రాష్ట్రాల కాంగ్రెస్ ఇంచార్జ్‌గా ప్రియాంక గాంధీ?.. తెలంగాణ, కర్ణాటకలపై ఫోకస్..!

Published : Aug 13, 2022, 01:50 PM IST
దక్షిణాది రాష్ట్రాల కాంగ్రెస్ ఇంచార్జ్‌గా ప్రియాంక గాంధీ?.. తెలంగాణ, కర్ణాటకలపై ఫోకస్..!

సారాంశం

2024 సార్వత్రిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతుంది. ఈ క్రమంలోనే దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా దక్షిణాది రాష్ట్రాలలో కాంగ్రెస్ బాధ్యతలను ప్రియాంక గాంధీకి అప్పగించే అవకాశం ఉన్నట్టుగా వార్తలు వెలువడుతున్నాయి. 

2024 సార్వత్రిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతుంది. ఈ క్రమంలోనే దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా దక్షిణాది రాష్ట్రాలలో కాంగ్రెస్ బాధ్యతలను ప్రియాంక గాంధీకి అప్పగించే అవకాశం ఉన్నట్టుగా వార్తలు వెలువడుతున్నాయి. దక్షిణాదిలో తమ ప్రభావాన్ని పెంచుకోవాలనే ఆలోచనతో.. ముఖ్యంగా కర్ణాటక, తెలంగాణ‌లపై కాంగ్రెస్ అధిష్టానం ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే ప్రియాంకకు దక్షిణాది రాష్ట్రాల ఇంచార్జ్‌గా నియమించాలనే ఆలోచనలో ఉన్నట్టుగా ప్రచారం జరుగుతుంది. సీడబ్ల్యూసీ మీటింగ్‌లో ఈ విషయంపై చర్చించిన  తర్వాత.. దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీ బాధ్యతలు ప్రియాంక గాంధీకి అప్పగించే విషయంలో స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

కేవలం పదో తరగతి చదివుంటే చాలు.. రూ.57,000 జీతంతో కేంద్ర హోంశాఖలో ఉద్యోగాలు
Indigo Crisis: ఇండిగో ఎయిర్ లైన్స్‌కి ఏమైంది.. అస‌లీ గంద‌ర‌గోళం ఏంటి.?