రామ్‌లాలాకు ప్ర‌త్యేక పూజ‌లు.. స‌ర‌యూ న‌ది ఒడ్డున దీపోత్స‌వానికి ప్ర‌ధాని మోడీ !

Published : Oct 23, 2022, 11:27 AM IST
రామ్‌లాలాకు ప్ర‌త్యేక పూజ‌లు.. స‌ర‌యూ న‌ది ఒడ్డున దీపోత్స‌వానికి ప్ర‌ధాని మోడీ !

సారాంశం

Ayodhya: ప్రధాని న‌రేంద్ర మోడీ తొలిసారిగా సరయూ నది ఒడ్డున దీపోత్సవ్‌లో పాల్గొననున్నారు. దీపావళి సందర్భంగా రాంలాలాకు ప్రార్థనలు చేయనున్నారు. అక్టోబరు 23న దీపోత్సవ వేడుకల కోసం ప్రధాని అయోధ్యకు రానున్నారు. ఆయన మొదటిసారి వ్యక్తిగతంగా హాజరుకానున్నారు.  

Deepavali-Deepotsav: దీపావళి సందర్భంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామ మందిరంలో పూజలు చేసి దీపోత్సవంలో పాల్గొననున్నారు. సాయంత్రం 6.30 గంటలకు, సరయూ నది ఒడ్డున జరిగే హారతికి ప్రధాని హాజరవుతారు. ఆ తర్వాత ఘనంగా దీపోత్సవ వేడుకలను ప్రారంభిస్తారు. ప్ర‌ధాని పంచతత్వానికి (నీరు, అంతరిక్షం, అగ్ని, గాలి, భూమి) ప్రతీకగా ఉండే ఐదు దీపాలను (మట్టి దీపాలు) వెలిగించ‌నున్నార‌ని సంబంధిత వ‌ర్గాలు వెల్ల‌డించాయి. ఈ సందర్భంగా 15 లక్షలకు పైగా దీపాలు వెలిగించే కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తున్నారు. దీపోత్సవ్ ఆరవ ఎడిషన్ ఈ ఏడాది జరుగుతుండగా, ప్రధాని మోడీ వేడుకల్లో వ్య‌క్తిగ‌తంగా పాల్గొనడం ఇదే తొలిసారి.

ప్రధానమంత్రి కార్యాలయం (PMO) విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం..రామమందిర నిర్మాణ ప్రదేశాన్ని కూడా ప్రధాని మోడీ పరిశీలించనున్నారు. పీఎం మోడీ దర్శనం కోసం భగవాన్ రామ్‌లాలా విరాజ్‌మాన్‌ను సందర్శిస్తారు. సాయంత్రం 5 గంటలకు ప్రార్థనలు చేస్తారు. అనంతరం రామజన్మభూమి తీర్థ క్షేత్రాన్ని సందర్శిస్తారు. ఆయన సాయంత్రం 5:45 గంటలకు ప్రతీకాత్మకమైన భగవాన్ రాముని రాజ్యాభిషేక పూజ‌లు చేస్తారు. సాయంత్రం 6:30 గంటలకు సరయూ నదిపై ఉన్న కొత్త ఘాట్ వద్ద హారతికి ప్రధాన మంత్రి హాజరవుతారు. అనంత‌రం ఘ‌నంగా దీపోత్సవ వేడుకలు ప్రారంభమవుతాయి.

 

దీపోత్సవ్ సందర్భంగా, ఐదు యానిమేటెడ్ టేబులా ప్రదర్శనలు, వివిధ రాష్ట్రాల నుండి వివిధ నృత్య రూపాలతో సహా పదకొండు రామలీలా పట్టిక ప్రదర్శనలు కూడా ఉంటాయి. గ్రాండ్ మ్యూజికల్ లేజర్ షోతో పాటు, సరయూ నది ఒడ్డున రామ్ కి పైడిలో జరిగే త్రీడీ హోలోగ్రాఫిక్ ప్రొజెక్షన్ మ్యాపింగ్ షోకు కూడా ప్రధాన మంత్రి హాజరవుతారు. దీపోత్సవంలో పాల్గొనేందుకు ప్రధాని మోడీ రానున్న నేపథ్యంలో అయోధ్యలో భద్రతను కట్టుదిట్టం చేశారు.

 

ఉత్తరప్రదేశ్‌లోని అవధ్ విశ్వవిద్యాలయానికి చెందిన వాలంటీర్లు అయోధ్యలోని రామ్‌కీ పైడి ఘాట్‌ల వద్ద 16 లక్షల దీపాలను వెలిగించడం ద్వారా అయోధ్యలో దీపావళి రోజున అత్యధిక దీపాలు (మట్టి దీపాలు) వెలిగించిన రికార్డును బద్దలు కొట్టడానికి ప్రయత్నిస్తున్నారు.
 

PREV
click me!

Recommended Stories

Republic Day Parade: ఘనంగా గణతంత్ర దినోత్సవ పరేడ్ సన్నాహాలు| Asianet News Telugu
Fresh Snowfall in Shimla Delights Tourists: రికార్డు స్థాయిలో సిమ్లాలో మంచు వర్షం| Asianet Telugu