పెట్రోల్, డీజిల్ ధరలు .. పరిష్కారం చూపండి: ప్రధానికి సోనియా లేఖ

Siva Kodati |  
Published : Feb 21, 2021, 09:55 PM ISTUpdated : Feb 21, 2021, 09:56 PM IST
పెట్రోల్, డీజిల్ ధరలు .. పరిష్కారం చూపండి: ప్రధానికి సోనియా లేఖ

సారాంశం

దేశంలో పెట్రోల్‌, డీజిల్‌, వంట గ్యాస్‌ ధరలు వరుసగా పెరగడంపై ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వంపై మండిపడుతున్నాయి. గత కొన్ని రోజులుగా దీనిపై నిరసనలు, ధర్నాలు చేస్తున్నాయి. తాజాగా కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ ప్రభుత్వంపై ఆందోళన వ్యక్తం చేశారు

దేశంలో పెట్రోల్‌, డీజిల్‌, వంట గ్యాస్‌ ధరలు వరుసగా పెరగడంపై ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వంపై మండిపడుతున్నాయి. గత కొన్ని రోజులుగా దీనిపై నిరసనలు, ధర్నాలు చేస్తున్నాయి.

తాజాగా కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ ప్రభుత్వంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె ప్రధాని నరేంద్రమోడీకి లేఖ రాశారు. ప్రజల కష్టంతో ప్రభుత్వం లాభాలను గడిస్తోందని ఆరోపించారు.

వెంటనే పెరిగిన చమురు ధరలను తగ్గించాలని మోడీని కోరారు. ఓ వైపు దేశ జీడీపీ క్షీణిస్తుంటే.. మరోవైపు గ్యాస్‌, డీజిల్‌, పెట్రోల్‌ ధరలు పెరుగుతున్నాయని దుయ్యబట్టారు.   

చమురు, గ్యాస్‌ ధరలు పెరుగుదలతో ప్రజలు పడుతున్న బాధలు, కష్టాలు చూసి ఈ లేఖ రాస్తున్నట్లు సోనియా ప్రస్తావించారు. దేశంలో ఉద్యోగాలు పోయాయని, ప్రజల ఆదాయాలు దారుణంగా పడిపోయాయని సోనియా గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు.

మధ్య తరగతి కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాయని పేర్కొన్నారు. ఇలాంటి సంక్షోభ సమయంలో లాభార్జనపై కేంద్ర ప్రభుత్వం సారించడం బాధాకరమని విమర్శించారు.  

దేశంలో ఎప్పుడూ లేని స్థాయికి చమురు ధరలు చేరాయని సోనియా ఆరోపించారు. ఓ వైపు అంతర్జాతీయంగా క్రూడాయిల్‌ ధరలు తగ్గుతున్నా.. చమురు ధరలు నిరంతరం పెరగడాన్ని ఆమె తప్పుబట్టారు.

కాంగ్రెస్ హయాంతో పోల్చుకుంటే ప్రస్తుతం క్రూడాయిల్‌ ధరలు సగం మాత్రమే ఉన్నాయని సోనియా వెల్లడించారు. నరేంద్రమోడీ అధికారం చేపట్టి నేటికి ఏడేళ్లు గడస్తున్నా.. మీ ప్రభుత్వ వైఫల్యాలకు గత ప్రభుత్వాలను బాధ్యులను చేయడమేంటని కాంగ్రెస్ అధినేత్రి ప్రశ్నించారు.

భారతీయ చమురు ఉత్పత్తి 2020లో 18 ఏళ్ల కనిష్ఠానికి చేరిందన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలన్నారు. స్వప్రయోజనాలు వీడి ప్రజలపై భారం పడకుండా చర్యలు చేపట్టాలని సోనియా కోరారు. ఈ అంశంలో సాకులు వెతక్కుండా సమస్యకు పరిష్కారం చూపుతారని ఆశిస్తున్నట్లు సోనియా ఆకాంక్షించారు.

PREV
click me!

Recommended Stories

Bank Holidays : అయ్యబాబోయ్.. ఈ నెలలో బ్యాంకులకు ఇన్ని సెలవులా? ఓసారి ఈ లిస్ట్ చూసుకోండి
Indians Return Safely from Dubai: దుబాయ్ నుడి క్షేమంగా తిరిగి వస్తున్న భారతీయులు | Asianet Telugu