సోనియాగాంధీ వ్యాఖ్యలపై దుమారం.. ట్వీట్ తొలగింపు..

Published : May 11, 2023, 12:40 AM IST
సోనియాగాంధీ వ్యాఖ్యలపై దుమారం.. ట్వీట్ తొలగింపు..

సారాంశం

కర్ణాటక ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ (Sonia Gandhi) చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దూమారం రేపాయి. దీంతో సోనియా గాంధీ సార్వభౌమాధికార ప్రకటనతో కూడిన ట్వీట్‌ను కాంగ్రెస్ తొలగించింది.

కర్ణాటక ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ (Sonia Gandhi) చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దూమారం చెలారేగింది. సోనియాగాంధీ తన ప్రసంగంలో 'సార్వభౌమాధికారం' అనే పదాన్ని ఉపయోగించారని, ఈ వ్యాఖ్యలపై అభ్యంతరం తెలిపిన బీజేపీ ఎంపీలు ఎన్నికల కమిషన్‌ (Election Commission)కు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాందీపై తక్షణ చర్యలు తీసుకోవాలని బీజేపీ ప్రతినిధి బృందం ఈసీని కోరింది.

తాజాగా ఈ అంశంపై కర్ణాటక కాంగ్రెస్ స్పందించింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ మాజీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ ఎప్పుడూ 'సార్వభౌమాధికారం' అనే పదాన్ని ఉపయోగించలేదని పేర్కొంది. 2023 మే 6న కర్ణాటకలోని హుబ్లీలో సోనియా గాంధీ తన ప్రసంగంలో 'సార్వభౌమాధికారం అనే పదాన్ని ఉపయోగించలేదు’ అని కాంగ్రెస్ బుధవారం ట్వీట్ చేసింది. కాంగ్రెస్ తన పోస్ట్‌లో సోనియా గాంధీ ప్రసంగం కాపీని , యూట్యూబ్ వీడియో లింక్‌ను కూడా షేర్ చేసింది.

మే 6వ తేదీన హుబ్లీలో సోనియా గాంధీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ ముగిసిన తర్వాత.. కాంగ్రెస్ పార్టీ తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో ఇలా ట్వీట్ చేసింది. "కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ (CPP) ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ నుండి 6.5 కోట్ల మంది కర్ణాటక ప్రజలకు బలమైన సందేశం. కర్ణాటక ఖ్యాతిని, సార్వభౌమత్వాన్ని, సమగ్రతను కాంగ్రెస్ ఎప్పటికీ కిందకి రానివ్వదు." అని పేర్కొంది. అయితే ఈ ట్వీట్‌ను కాంగ్రెస్ తన హ్యాండిల్ నుండి తొలగించింది.

ఎన్నికల సంఘానికి ఫిర్యాదు

ఈ ప్రకటనపై కేంద్ర మంత్రులు భూపేంద్ర యాదవ్, జితేంద్ర సింగ్, పార్టీ నేత అనిల్ బలూనీ నేతృత్వంలోని బీజేపీ ప్రతినిధి బృందం సోమవారం ఎన్నికల సంఘాన్ని కలిసింది. సోనియా గాంధీపై చర్యలు తీసుకోవాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. సోనియా గాంధీ సార్వభౌమాధికారం గురించి మాట్లాడి దేశ రాజ్యాంగాన్ని అవమానించారని అన్నారు. ఆమెపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసేలా ఆదేశాలివ్వాలని ఎన్నికల సంఘాన్నికోరారు.

ప్రధాని మోదీ స్పందన

ఆదివారం మైసూరులోని నంజన్‌గూడ్‌లో బీజేపీ నిర్వహించిన ర్యాలీలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. కాంగ్రెస్ చేసిన ఈ ట్వీట్‌పై ప్రధాని నరేంద్ర మోదీ ఇలా అన్నారు. “ఈ ఎన్నికల్లో  రాజకుటుంబం (కాంగ్రెస్) కర్ణాటక సార్వభౌమత్వాన్ని కాపాడాలని అన్నారు. స్వతంత్రంగా, కర్ణాటకను సార్వభౌమ దేశం అంటారు. అంటే.. భారతదేశం నుండి కర్ణాటకను విడదీయాలని కాంగ్రెస్ బాహాటంగా సమర్ధిస్తోంది. కాంగ్రెస్‌లో తుక్డే-తుక్డే గ్యాంగ్ ఇంత స్థాయికి చేరుతుందని నేను ఎప్పుడు అనుకోలేదు." అని విమర్శించారు. దీంతో ఈ ట్వీట్‌పై ఎన్నికల సంఘం సోమవారం కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గేను వివరణ కోరింది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IT Jobs : ఇక TCS లో ఉద్యోగాలే ఉద్యోగాలు
Nuclear Devices in Himalayas : నెహ్రూ, ఇందిరాలే ప్రస్తుత ప్రకృతి విపత్తులకు కారణమా..?