తన పెళ్లికాకుండా మంత్రగత్తెలా అడ్డుపడుతోందని.. తల్లిని చంపిన తనయుడు

Published : Nov 11, 2022, 08:32 AM IST
తన పెళ్లికాకుండా మంత్రగత్తెలా అడ్డుపడుతోందని.. తల్లిని చంపిన తనయుడు

సారాంశం

తనకు పెళ్లికాకుండా తల్లే మంత్రగత్తెలా అడ్డుపడుతోందని ఓ కొడుకు దారుణానికి ఒడిగట్టాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో తల్లిని కొట్టి చంపేశాడు. 

భోపాల్ : మూడుపదులు దాటినా తనకింకా పెళ్లి చేయడంలేదని ఓ యువకుడు తల్లి మీద కసి పెంచుకున్నాడు. విచక్షణ మరిచి ఆమె ఏం చెబుతుందో.. ఎందుకు చెబుతుందో ఆలోచించలేకపోయాడు. అంతే కసితీరాఆమెను కడతేర్చాడు. ఏ బాధ్యతా లేకుండా తిరుగుతున్న కొడుకును ఉద్యోగం తెచ్చుకుంటే పెళ్లి చేస్తానని చెప్పడమే ఆ తల్లి పాలిట శాపంగా మారింది. అర్థాంతరంగా కన్నకొడుకు చేతిలోనే కన్నుమూయాల్సి వచ్చింది. 

ఈ ఘటన మధ్యప్రదేశ్ లో కలకలం రేపింది. తన పెళ్లికి తల్లి దెయ్యంలా అడ్డు పడుతోందంటూ రెచ్చిపోయిన ఓ వ్యక్తి కన్నతల్లినే కడతేర్చాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమెను క్రికెట్ బ్యాట్ తో కొట్టి చంపేశాడు. మధ్యప్రదేశ్లోని భోపాల్ నగరంలో మంగళవారం రాత్రి ఈ దారుణం జరిగింది.  అబ్దుల్  అహ్మద్ ఫర్హాన్ (32) అనే వ్యక్తి తన తల్లి ఆస్మా ఫరూక్ (62), సోదరుడు,  అతడి భార్యతో కలిసి ఒకే ఇంట్లో నివసిస్తూ ఉండేవాళ్ళు. అహ్మద్  కామర్స్ లో డిగ్రీ పూర్తి చేశాడు. కానీ ఏ ఉద్యోగం సద్యోగం లేకుండా ఇంట్లోనే ఉండేవాడు.  తనకు పెళ్లి చేయాలంటూ అహ్మద్ తల్లితో తరచుగా గొడవ పడుతూ ఉండేవాడు.

వింత పెళ్లి.. దివ్యాంగురాలైన కుమార్తెను భగవాన్ శ్రీకృష్ణుడికి ఇచ్చి వివాహం...

దీంతో విసిగిపోయిన తల్లి.. ‘పెళ్లి ఆలోచన చేసే ముందు ఉద్యోగం సంపాదించమని ఆస్మా అతడికి చెబుతుండేది. ఈ క్రమంలోనే వారి మధ్య తరచుగా గొడవలు, వాగ్వాదాలు జరుగుతుండేవి. తనకు పెళ్లి చేయడం తల్లికి ఇష్టం లేదని ఫర్హాన్ భావించాడు. మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో వారి మధ్య మళ్ళీ గొడవ జరిగింది. ఈ క్రమంలోనే అతడు ఆస్మాను క్రికెట్ బ్యాట్, ఐరన్ రాడ్ తో కొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఇంటికి వచ్చిన సోదరుడు, అతడి భార్యకు తల్లి మేడ మీద నుంచి పడి చనిపోయింది అని చెప్పాడు’ అని పోలీసులు తెలిపారు.

ఈ విషయం తెలిసి ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులకు అబ్దుల్ తీరు అనుమానాస్పదంగా కనిపించింది. దీంతో అతనిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా తాను చేసిన నేరాన్ని అంగీకరించాడు. అబ్దుల్ ఇంటర్నెట్లో తరచూ దయ్యాలు, మంత్రగత్తెల వీడియోలు చూస్తూ ఉండేవాడు. ఈ క్రమంలోనే తల్లి దయ్యంలా తన పెళ్లికి అడ్డుపడుతోందని భావించి ఈ దారుణానికి ఒడిగట్టాడు అని పోలీసులు తెలిపారు.

PREV
click me!

Recommended Stories

Tamilnadu Incidnt : నిందితుడికి రెండు మరణశిక్షలు | Asianet News Telugu
Coimbatore Child Case: 10 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగితే జోకులేంటి... సస్పెండ్ చేసిన సీఎం విజయ్