
మాజీ అటార్నీ జనరల్ సోలి సోరాబ్జీ శుక్రవారం ఉదయం కరోనాతో మరణించారు. ఆయన వయసు 91 సంవత్సరాలు. దేశంలోని అత్యుత్తమ న్యాయవాదులలో సోలి సోరాబ్జీ ఒకరు.
సీనియర్ న్యాయవాది, పద్మ విభూషణ్ గ్రహీత సోలి సోరబ్జీ కరోన పాజిటివ్ తో ఢిల్లీలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృత్యువాత పడ్డారు.
ఆయన పూర్తి పేరు సోలి జెహంగీర్ సోరబ్జీ. 1930 లో ముంబైలో జన్మించారు. 1953 లో బ హైకోర్టులో తన న్యాయవాద ప్రాక్టీసును ప్రారంభించారు. 1971 లో, ఆయన సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదిగా నియమితులయ్యారు.
సోరబ్జీ 1989లో మొదటిసారిగా అటార్నీ జనరల్ అయ్యారు. ఆ తరువాత 1998 నుండి 2004 వరకు కొనసాగారు. మానవ హక్కుల కోసం నిరంతరం పోరాటం చేసిన న్యాయవాది సొరాబ్జీ. ఆయన 1997 లో నైజీరియా కోసం యూఎన్ ప్రత్యేక రిపోర్టర్‌గా నియమించబడ్డారు.