ఏసీ ఆన్ చేస్తే.. భయంకరమైన శబ్ధం: విప్పి చూస్తే

Siva Kodati |  
Published : Jun 14, 2019, 04:12 PM IST
ఏసీ ఆన్ చేస్తే.. భయంకరమైన శబ్ధం: విప్పి చూస్తే

సారాంశం

పాములు, ఇతర జీవరాశికి మనిషి ఆవాసాలు లేకుండా చేస్తుండటంతో అవి జనాల మధ్యలోకి వస్తున్నాయి. తాజాగా ఓ పాము ఏకంగా ఇంటి ఏసీలో దూరి, దాదాపు మూడు నెలల పాటు ఏంజాయ్ చేసింది

పాములు, ఇతర జీవరాశికి మనిషి ఆవాసాలు లేకుండా చేస్తుండటంతో అవి జనాల మధ్యలోకి వస్తున్నాయి. తాజాగా ఓ పాము ఏకంగా ఇంటి ఏసీలో దూరి, దాదాపు మూడు నెలల పాటు ఏంజాయ్ చేసింది.

వివరాల్లోకి వెళితే.. తమిళనాడు రాష్ట్రం పుదుచ్చేరి తెంగాయితిట్టుకు చెందిన ఏలుమలై ఇంట్లోని బెడ్‌రూమ్‌లో ఏసీ ఉంది. ఏసీ ఆన్ చేయగానే ఈ మధ్యకాంలో తరచుగా శబ్ధం వస్తోంది. దీంతో ఆయన మెకానిక్‌ను పిలిపించాడు.

ఏసీని విప్పి చూడగా రెండు పాము కుబుసాలు కనిపించాయి. జాగ్రత్తగా పరిశీలించగా అందులో ఓ పాము ఉన్నట్లు గుర్తించారు. దీంతో వెంటనే ఆయన అటవీశాఖ సిబ్బందికి సమాచారం అందించారు.

వారు దాదాపు రెండు గంటల పాటు శ్రమించి  రెండు అడుగుల పామును బయటకు తీశారు. ఏసీకి ఉన్న బయటి వైపు పైపును సరిగ్గా మూయకపోవడం వల్లే పాము లోనికి వచ్చి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.. పట్టుకున్న పామును సమీపంలోని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. 

PREV
click me!

Recommended Stories

దేశంలో చ‌క్కెర ధ‌ర‌లు ఎందుకు పెరుగుతున్నాయి? ఇందుకు కార‌ణం అదేనా.?
USA: న్యూయార్క్‌లో ఘ‌నంగా ‘భారత్ బియాండ్ బోర్డర్స్ 2.0’ గాలా కార్య‌క్ర‌మం