
Chennai-Delhi Rajdhani Express: చెన్నై-ఢిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్రమాదం తప్పింది. ఎక్స్‌ప్రెస్‌లో ఉన్నట్లుండి ఒక్కసారిగా పొగలు వ్యాపించాయి. దాంతో లోకోపైలట్ అప్రమత్తమై... రైలును ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా కావలి రైల్వేస్టేషన్‌లో నిలిపివేశారు. ఈ ఘటనతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. సమాచారం ప్రకారం.. ఆదివారం నాడు చెన్నై నుంచి ఢిల్లీ వెళ్తున్న రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలులోని బీ-5 బోగీలోని చక్రాల దగ్గర పొగలు రావడం ప్రారంభించాయి. ఇది చూసిన ప్రయాణికులలో భయాందోళనలకు లోనయ్యారు.
పొగలు రావడంతో కావలి రైల్వేస్టేషన్ సమీపంలో సుమారు 20 నిమిషాల పాటు రైలు నిలిచిపోయింది. ఈ ఘటనపై విచారణ జరిపిన రైల్వే అధికారులు.. బ్రేక్ జామ్ కారణంగానే పొగలు వెలువడ్డాయని తెలిపారు. రైలు మరమ్మతులు చేసిన తర్వాత మళ్లీ ప్రయాణం ప్రారంభించామని చెప్పారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఎవరూ కూడా గాయపడలేదు.
గతంలో ఇలాంటి ఘటనలు
అంతకుముందు పూణే నుంచి జమ్మూ తావి మధ్య నడుస్తున్న జీలం ఎక్స్‌ప్రెస్ రైలు లో పొగలు వెలువడ్డాయి. దీంతో ప్రయాణికులు చైన్ లాగి రైలును నిలిపివేశారు. రైల్వే అధికారుల నుంచి అందిన సమాచారం మేరకు ఔటర్‌లో రైలును ఆపి పొగను తనిఖీ చేశారు. రైలు గార్డు , లోకో పైలట్ కోచ్‌ను తనిఖీ చేసి, పొగలు రావడానికి కారణం డైనమో బెల్ట్ వేడి కావడమేనని చెప్పారు. దీని తర్వాత, డైనమో బెల్ట్‌ను తొలగించి, ఇతర కోచ్‌కు కనెక్ట్ చేశారు. తర్వాత రైలును ప్రారంభించింది.
దీంతో పాటు అజ్మీర్ నుంచి బ్రాంద్రా వెళ్తున్న అజ్మీర్-బాంద్రా రైలు లో కూడా బ్రేక్ లాక్ జామ్ కారణంగా మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణికుల్లో భయాందోళన నెలకొంది. అయితే.. రైల్వే ఉద్యోగులు ప్రయాణికులను బయటకు తీసుకొచ్చి అదుపులోకి తెచ్చారు. సమాచారం ప్రకారం.. కిషన్‌గఢ్ రైల్వే స్టేషన్‌లో ఈ సంఘటన జరిగింది. అక్కడ సుమారు అరగంట పాటు మరమ్మతులు చేసి రైలును ప్రారంభించారు.