ఎయిర్ ఇండియా విమానంలో పొగ‌లు.. మ‌స్క‌ట్ విమానాశ్ర‌య‌మంలో నిలిచిన ఫ్లైట్

By Mahesh RajamoniFirst Published Sep 14, 2022, 5:20 PM IST
Highlights

Air India flight: మస్కట్ విమానాశ్రయంలో ఇంజిన్ నుండి పొగలు రావడంతో ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ ఆగిపోయింది. టేకాఫ్‌కు ముందు ఇంజన్‌లలో ఒకదానిలో పొగ కనిపించడంతో కొచ్చికి బయలుదేరిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానంలోని ప్ర‌యాణికులను ముందు జాగ్ర‌త్త‌గా కింద‌కు దింపారు.
 

Air India flight: మస్కట్ విమానాశ్రయంలో.. ఇంజిన్ నుండి పొగలు రావడంతో ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ ఆగిపోయింది. టేకాఫ్‌కు ముందు ఇంజన్‌లలో ఒకదానిలో పొగ కనిపించడంతో కొచ్చికి బయలుదేరిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానంలోని ప్ర‌యాణికులను ముందు జాగ్ర‌త్త‌గా కింద‌కు దింపారు. ఈ ఘ‌ట‌న‌లో 14 మంది ప్ర‌యాణికులు గాయ‌ప‌డ్డార‌ని టైమ్స్ ఆఫ్ ఒమ‌న్ నివేదించింది. 

వివ‌రాల్లోకెళ్తే.. 141 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో ఒమ‌న్ లోని  మస్కట్ నుండి కొచ్చికి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం  టేకాఫ్ కు ముందు నిలిచిపోయింది. బుధవారం నాడు మస్కట్ విమానాశ్రయంలో ఉన్న విమానంలోని ఇంజన్‌లలో ఒకదానిలో ఒక్క‌సారిగా పొగ రావ‌డంతో అప్ర‌మ‌త్త‌మైన సిబ్బంది.. టేకాఫ్ నిలిపివేశారు. ముందుజాగ్రత్త చర్యగా విమానంలో ఉన్న 141 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది సురక్షితంగా  కింద‌కు దించిన‌ట్టు అధికారులు వెల్ల‌డించారు. అయితే, మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో బుధవారం ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం నుండి పొగలు రావడంతో సుమారు 14 మంది గాయపడ్డారని టైమ్స్ ఆఫ్ ఒమ‌న్ నివేదించింది. 

మస్కట్ విమానాశ్రయంలో విమానం రన్‌వేపై ఉన్నప్పుడు ఇంజిన్‌లలో ఒకదాని నుండి పొగలు రావడంతో ఎయిర్ ఇండియాకు చెందిన IX 442 విమానం టేకాఫ్‌ను నిలిపివేసింది. విమానం ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం, బోయింగ్ 737-800 వెనుక పార్క్ చేయబడింది. ఘటనకు గల కారణాలను తెలుసుకోవడానికి ఇంజనీర్ల బృందం విమానాన్ని తనిఖీ చేస్తోందని సంబంధిత వ‌ర్గాలు తెలిపాయి. మరోవైపు ప్రయాణికులందరినీ కొచ్చికి తీసుకొచ్చేందుకు విమానయాన సంస్థలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాయి.

 

Passengers evacuate Air India Express via slides - flight IX-442, (VT-AXZ)

pic.twitter.com/bpUYJTMpFZ

— Flight Emergency (@FlightEmergency)

"మస్కట్ విమానాశ్రయంలోని రన్‌వేపై ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం [కొచ్చికి] ఇంజిన్ నంబర్ టూలో పొగ కనిపించడంతో ప్రయాణికులందరినీ సురక్షితంగా ఖాళీ చేయించారు. రిలీఫ్ ఫ్లైట్ ఏర్పాటు చేయాలి. మేము సంఘటనపై దర్యాప్తు చేసి తగిన చర్యలు తీసుకుంటాము" అని డైరెక్టరేట్ ఆఫ్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. కాగా, రెండు నెలల క్రితం కాలికట్‌ నుంచి దుబాయ్‌కి వెళ్లే ఎయిర్‌ ఇండియా విమానంలో కాలిన వాసన రావడంతో మస్కట్‌కు మళ్లించాల్సి వచ్చింది. ఎలాంటి ప్ర‌మాదం చోటుచేసుకోక‌పోవ‌డంతో అంద‌రూ ఊపిరి పీల్చుకున్నారు. 

 

All passengers were safely evacuated after smoke was detected in engine no. 2 of Air India Express flight (to Cochin) on the runway at Muscat airport. Relief flight to be arranged. We will investigate the incident and also take appropriate action: DGCA pic.twitter.com/L7w9yX4GrH

— ANI (@ANI)
click me!