రైల్వేలో కొత్త టెక్నాలజీ.. బడ్జెట్ లో ప్రవేశపెట్టనున్న నిర్మలమ్మ

By telugu news team  |  First Published Jan 29, 2021, 1:22 PM IST

ఇది ప్రయాణికులకు ప్రైవసీ కల్పిస్తుంది. ఇదేవిధంగా బోగీల మధ్య ఉన్న గ్లాస్ డోర్లను కూడా మార్చనున్నారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో.. ముందస్తు చర్యగా రైళ్లలోని కర్టెన్లను తొలగించి ఇటువంటి విండో గ్లాసులను ఏర్పాటు చేయనున్నారు. 


రైల్వే భద్రతకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్త టెక్నాలజీని ప్రవేశపెట్టే అవకాశం ఉందని సమాచారం. ఇది ప్రయాణికులకు మరింత సౌకర్యవంతంగా మారనుంది. రైల్వేల ఆధునీకరణలో ఇది మరో మెట్టుగా మారే అవకాశం ఉంది. 

త్వరలోనే ఢిల్లీ-హౌరా రాజధాని ఎక్స్ ప్రెస్ లో ప్రయాణికులందరికీ ఈ సరికొత్త ఫీచర్ అందుబాటులోకి  వస్తోంది. స్మార్ట్ స్విచ్ ఆన్ చేస్తే రైలు బోగి కిటికీలు.. లోపలి తలుపులు పారదర్శకంగా మారుతాయి. స్విచ్ ఆఫ్ చేసి వాటిని అవసరమైతే అపారదర్శకంగా కూడా మార్చుకోవచ్చు. ఇది ప్రయాణికులను యూవీ కిరణాలు( అతినీల లోహిత కిరణాలు) నుంచి రక్షిస్తుంది. అంతేకాకుండా.. బయటి వారికి ప్రయాణికులు కనిపించారు.

Latest Videos

ఇది ప్రయాణికులకు ప్రైవసీ కల్పిస్తుంది. ఇదేవిధంగా బోగీల మధ్య ఉన్న గ్లాస్ డోర్లను కూడా మార్చనున్నారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో.. ముందస్తు చర్యగా రైళ్లలోని కర్టెన్లను తొలగించి ఇటువంటి విండో గ్లాసులను ఏర్పాటు చేయనున్నారు. ఈ సౌకర్యాన్ని రైల్వేశాఖ మిగిలిన రైళ్లకు కూడా విస్తరించే అవకాశం ఉంది. వచ్చే బడ్జెట్ లో ఆధునీకరణకు కేటాయింపులు పెంచే అవకాశం ఉంది. 

click me!