ఛత్తీస్‌గడ్‌ - తెలంగాణ సరిహద్దుల్లో భారీ ఎన్‌కౌంటర్.. ఆరుగురు మావోయిస్టుల మృతి

By Sumanth Kanukula  |  First Published Dec 27, 2021, 9:15 AM IST

ఛత్తీస్‌గడ్‌ - తెలంగాణ సరిహద్దుల్లో భారీ ఎన్‌కౌంటర్ (Encounter) జరిగింది. తెలంగాణ సరిహద్దుల్లోని కుంట ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి.  ఈ ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మావోయిస్టులు మృతిచెందారు.


ఛత్తీస్‌గడ్‌ - తెలంగాణ సరిహద్దుల్లో భారీ ఎన్‌కౌంటర్ (Encounter) జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మావోయిస్టులు మృతిచెందారు. తెలంగాణ సరిహద్దుల్లోని కుంట ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. గత కొద్ది రోజులుగా ములుగు, భదాద్రి కొత్తగూడెం జిల్లాల అటవీ ప్రాంతంలో మావోయిస్టులు కార్యకలాపాలు పెరిగాయి. దీంతో తెలంగాణ గ్రేహౌండ్స్ బలగాలు ఆ ప్రాంతంపై ప్రత్యేక దృష్టి సారించాయి. తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దు అటవీ ప్రాంతంలో గ్రేహౌండ్స్ బలగాలు కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించాయి. ఈ క్రమంలోనే బలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. 

రాత్రి నుంచి కొనసాగుతున్న ఈ ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతిచెందారు.  దీనిపై పోలీసుల నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇక, ఘటన స్థలంలో మావోయిస్టుల మృతదేహాలతో పాటుగా వారి ఆయుధాలను గ్రేహౌండ్స్ బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. మృతుల్లో చర్ల మిలీషియా కమాండర్ మధు ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల్లో నలుగురు మహిళా నక్సలైట్లు ఉన్నారు. ఆ ప్రాంతంలో ఇంకా కూంబింగ్ కొనసాగుతుంది. అయితే సరిహద్దు ప్రాంతంలో ఎన్‌కౌంటర్ జరగడం.. అటవీ ప్రాంతం ఛత్తీస్‌గఢ్ పరిధిలో ఉండటంతో మావోయిస్టుల మృతదేహాలను ఎక్కడికి తరలిస్తారనే దానిపై స్పష్టత లేదు. కాగా, ఈ ఎన్‌కౌంటర్‌కు పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. 

Latest Videos

click me!