ఒడిశాలో మరో విషాదం.. గూడ్స్ రైలు కింద పడి ఆరుగురు మృతి.. పలువురి పరిస్థితి విషమం

By Rajesh KarampooriFirst Published Jun 7, 2023, 11:47 PM IST
Highlights

బాలాసోర్ రైలు ప్రమాద ఘటన తర్వాత.. ఒడిశాలోని జాజ్‌పూర్‌లో మరో విషాదం చోటుచేసుకుంది.ఈ ప్రమాదంలో రైలు ఢీకొని 6 మంది కార్మికులు మరణించారు. ఈ ఘటన ఒడిశాలోని జాజ్‌పూర్‌లో చోటుచేసుకుంది. 

ఒడిశాలోని బాలాసోర్‌లో ట్రిపుల్ రైలు ప్రమాదం మరువకముందే వరుసగా ప్రమాదాలు చోటుచేసుకుంటాయి. తాజాగా జాజ్‌పూర్‌లో బాధాకరమైన ప్రమాదం జరిగింది. గూడ్స్ రైలు ఢీకొని నలుగురు కూలీలు మృతి చెందగా, ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. 

భారీ వర్షం నుంచి తమని తాము కాపాడుకోవడానికి ఆరుగురు కూలీలు గూడ్స్ రైలు కింద తలదాచుకున్నారు. అయితే అది అకస్మాత్తుగా ఇంజిన్ లేకుండా కదలడం ప్రారంభించింది. దీంతో కూలీలు రైలు కింద నుంచి బయటకు వచ్చే అవకాశం లేకుండా పోయింది. ఆ బోగీల కింద్ర పడి మరణించారు. 

అకస్మాత్తుగా భారీ వర్షం కురిసిందనీ, దీంతో కూలీలు వర్షం పడకుండా  గూడ్స్ రైలు కింద దాక్కున్నారని  రైల్వే అధికార ప్రతినిధి తెలిపారు. దురదృష్టవశాత్తు.. గూడ్స్ రైలు ఇంజిన్ లేకున్నా కదలడం వల్ల ప్రమాదం జరిగింది. నలుగురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందగా, ముగ్గురు గాయపడ్డారు. అయితే గాయపడిన మరో ఇద్దరు మరణించినట్లు జాజ్‌పూర్ స్థానికులు పేర్కొన్నారు.

ఇటీవల ఒడిశాలోని బాలాసోర్‌లో రైలు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 288 మంది మరణించారు. 1100 మందికి పైగా గాయపడ్డారు. ప్రమాదంపై సీబీఐ విచారణ జరుపుతోంది. బహ్నాగా రైల్వే స్టేషన్‌లలో ఘటనా స్థలానికి సీబీఐ బృందం చేరుకుని విచారణ చేపట్టింది. బృందం మెయిన్ లైన్, లూప్ లైన్ రెండింటినీ తనిఖీ చేసింది.

ఈ క్రమంలో సిబిఐ అధికారులు కూడా సిగ్నల్ రూమ్‌కు వెళ్లారు. ఈ బృందంతో రైల్వే అధికారులు కూడా ఉన్నారు. టీమ్ మొత్తం దృష్టి ప్రమాదానికి గల కారణం, నిందితుడిపై దర్యాప్తు చేయడంపైనే ఉంది. దీనికి సంబంధించి బృందం రైల్వే భద్రతా నిపుణులతో కూడా సంప్రదించవచ్చు. సిబిఐ జాయింట్ డైరెక్టర్ (స్పెషల్ క్రైమ్) విప్లవ్ కుమార్ చౌదరి నేతృత్వంలోని బృందాన్ని దర్యాప్తు చేస్తున్నారు.

 

click me!