నాగాలాండ్‌లో దారుణం: ఉగ్రవాదులనే అనుమానంతో కాల్పులు, 13 మంది పౌరులు మృతి, ఉద్రిక్తత

By narsimha lode  |  First Published Dec 5, 2021, 9:54 AM IST

నాగాలాండ్ లోని మోన్ జిల్లాలోని ఓటింగ్ గ్రామంలో ఉగ్రవాదులుగా భావించి సాధారణ పౌరులపై కాల్పులు జరపడంతో ఆరుగురు పౌరులు మరణించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అనుమానిస్తున్నారు. ఈ  ఘటనలో ఇద్దరు గాయపడ్డారు.


న్యూఢిల్లీ:  Nagaland లోని Mon జిల్లాలోని ఓటింగ్  గ్రామంలో ఎన్‌ఎస్‌పీఎన్ మిలిటెంట్లుగా అనుమానిస్తున్న వారిపై భద్రతా దళాలు శనివారం నాడు రాత్రి  కాల్పులు జరపడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనలో 13 మంది మరణించారు. మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు.  దీంతో ఆగ్రహం చెందిన స్థానికులు కొన్ని వాహనాలకు నిప్పు పెట్టారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. స్థానికులు నిప్పు పెట్టిన వాహనాలు భద్రతా బలగాలకు చెందినవిగా అనుమానిస్తున్నారు.ఓటింగ్ గ్రామానికి చెందిన కొంత మంది వ్యక్తులు మినీ ట్రక్కులో ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో ఉగ్రవాదులుగా అనుమానించిన భద్రతా బలగాలుత కాల్పులు జరిపారు. దీంతో వారంతా అక్కడికక్కడే మరణించారు. అయితే  తమ వారు ఇంటికి ఇంకా తిరిగి రాకపోవడంతో గ్రామస్తులు, వలంటీర్లు వెతికారు. అయితే ట్రక్కులో వీరి మృతదేహలు కన్పించాయి. దీంతో స్థానికులు భద్రతా బలగాలకు చెందిన వాహనాలకు నిప్పు పెట్టారు.

 

The unfortunate incident leading to killing of civilians at Oting, Mon is highly condemnable.Condolences to the bereaved families & speedy recovery of those injured. High level SIT will investigate & justice delivered as per the law of the land.Appeal for peace from all sections

— Neiphiu Rio (@Neiphiu_Rio)

Latest Videos

undefined

  ఈ ఘటనను నాగాలాండ్ సీఎం Neiphiu Rio తీవ్రంగా ఖండించారు. ఈ ఘటన దురదృష్టకరమైందన్నారు. ఈ ఘటనపై సిట్ దర్యాప్తు చేస్తుందని సీఎం ప్రకటించారు.ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. సమాజంలోని అన్ని వర్గాల నుండి శాంతి నెలకొనాలని ఆయన కోరుకొన్నారు.ఈ ఘటన తర్వాత శనివారం రాత్రి నుండి ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. ఈ ఘటనపై ఆర్మీ కోర్డ్ ఆఫ్ ఎంక్వైరీకి ఆదేశించింది.  ఈ ఘటనపై కేంద్ర హోంశాఖ మంత్రి  అమిత్ షా కూడా సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు సానుభూతి చెప్పారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఆయన తన సంతాపాన్ని తెలిపారు. 

also read:మొత్తం ప్రతిపక్షమే ప్రభుత్వంలో కలిసింది.. ఆ రాష్ట్రంలో ఆసక్తికర పరిణామం

 రాష్ట్ర ప్రజలు హార్న్‌బిల్ అనే పండుగను జరుపుకొంటున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకొంది. రాష్ట్రంలో ఇది అతి పెద్ద పండుగ.మోన్ జిల్లా మయన్మార్ తో ఉన్న అంతర్జాతీయ సరిహద్దును కలిగి ఉంది. ఈ ప్రాంతంలోNSCN (k) వర్గానికి ప్రాబల్యం ఉంది.భద్రతా బలగాలు పౌరులు ప్రయాణీస్తున్న వాహనం పై పొరపాటున కాల్పుుల జరిపారా, లేదా ఉద్దేశ్యపూర్వకంగా కాల్పులు జరిపారా అనే కోణంలో దర్యాప్తు సాగిస్తున్నారు అధికారులు. నిషేధిత ఎన్ఎస్‌సీఎన్ (కే) వర్గానికి చెందిన మిలిటెంట్ల కదలికలపై కచ్చితమైన సమాచారం ఆధారంగా తమకు అందిన సమాచారం ఆధారంగా  ఆపరేషన్ నిర్వహిస్తున్న  సమయంలో ఆర్మీ వాహనంపై కాల్పులు జరిపారని  భద్రతా బలగాలు తెలిపాయి.  అయితే ఈ ఘటనలో ఓ ఆర్మీ జవాను కూడా మరణించినట్టుగా అధికారులు ప్రకటించారు. అంతేకాదు పలువురు గాయపడ్డారని తెలిపారు.

click me!