తల్లిని చంపేసి.. శవం పక్కన ఆ కూతుళ్లు ఏం చేశారంటే..!

Published : Jul 23, 2021, 08:03 AM IST
తల్లిని చంపేసి.. శవం పక్కన ఆ కూతుళ్లు ఏం చేశారంటే..!

సారాంశం

అక్కాచెల్లెళ్లకు మెల్లగా నచ్చచెప్పి బయటకు తీసుకొచ్చిన పోలీసులు.. వైద్య పరీక్షల కోసం వారిని ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

కన్న తల్లిని ఇద్దరు కూతుళ్లు అతి కిరాతకంగా చంపేశారు. అనంతరం ఆ శవం పక్కన కూర్చొని ఆటలాడుకున్నారు. ఈ సంఘటన తమిళనాడులో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

తిరునెల్వెలి జిల్లాకు చెందిన ఉషా అనే మహిళకు పెళ్లై భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా... కొన్ని కారణాల వల్ల ఆమె భర్తకు దూరమైంది. పిల్లలతో కలిసి.. ట్యూషన్లు చెప్పుకుంటూ జీవిస్తోంది. 

కాగా.. మంగళవారం నాడు ఆమె ఎంతకీ ఇంటినుంచి బయటకు రాకపోవడంతో  చుట్టుపక్కల వారికి అనుమానం వచ్చింది. ఇంతలో ఆమె కుమార్తెల్లో ఒకరు బయటకు వచ్చి.. తమ తల్లి చనిపోయిందని చెప్పి మళ్లీ లోపలికెళ్లి తలుపులేసుకుంది.  దీంతో చుట్టుపక్కల వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.  ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కిటికీలో నుంచి తొంగి చూడగా ఒళ్లు గగుర్పొడిచే దృశ్యమొకటి వారి కళ్లపడింది. రక్తపుమడుగులో పడిఉన్న తల్లి శవం పక్కనే ఆ అక్కాచెల్లెళ్లు ఇద్దరూ బంతి ఆట ఆడుకుంటూ కనిపించారు.

తల్లి మరణం వారిపై ఎటువంటి ప్రభావం చూపకపోవడం పోలీసులనే నిర్ఘాంతపరిచింది. అక్కాచెల్లెళ్లకు మెల్లగా నచ్చచెప్పి బయటకు తీసుకొచ్చిన పోలీసులు.. వైద్య పరీక్షల కోసం వారిని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో తానే ఈ హత్య చేసినట్టు కుమార్తెల్లో ఒకరు అంగీకరించారు. కత్తితో పొడిచి చంపినట్లు ఆమె చెప్పింది. కాగా, అక్కాచెల్లెళ్లకు మానసిక సమస్యలు ఏమైనా ఉన్నాయా అనే విషయాన్ని తెలుసుకున్నాకే కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.

PREV
click me!

Recommended Stories

బీహార్ రాజకీయాల్లో 30ఏళ్ల BJP కోట బద్దలు ప్రశాంత్ కిషోర్ చారిత్రక విజయం| Prashant Kishor victory
త్వరలో ప్లాస్టిక్ నోట్లు...ఇక పాత నోట్లు బ్యాన్ చేస్తారా? | Plastic Currency in India