లాడ్జిలో ప్రియురాలితో రొమాన్స్... నగ్నంగా పట్టుకున్న భార్య..!

Published : Jul 23, 2021, 07:37 AM IST
లాడ్జిలో ప్రియురాలితో రొమాన్స్... నగ్నంగా పట్టుకున్న భార్య..!

సారాంశం

జవాన్ భార్యకు తెలీకుండా మరో మహిళతో ప్రేమాయణం మొదలుపెట్టాడు. ఆమెతో తరచూ మాట్లాడుతుండడంతో అతడి భార్యకు అనుమానం వచ్చింది.   

కట్టుకున్న భార్యను మోసం చేశాడు. భార్యకు తెలీకుండా మరో మహిళతో సంబంధం పెట్టుకున్నాడు. తరచూ ప్రియురాలితో ఫోన్ లో రాసలీలలు నడిపేవాడు. భర్త తనను పట్టించుకోకుండా తరచూ ఫోన్ లో గడపడంపై ఆ భార్యకు అనుమానం కలిగింది. దీంతో.. భర్తపై నిఘా వేసింది. ఈ క్రమంలో.. ప్రియురాలితో సహా భర్త లాడ్జ్ లో సరసాలాడుతూ ఆమెకు దొరికిపోయాడు. దానిని ఆమె వీడియో తీయగా.. ఆ వీడియో కాస్త వైరల్ గా మారింది. ఈ సంఘటన రాజస్తాన్ లో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఓ సీఆర్పీఎఫ్ జవాన్ రాజస్తాన్ రాష్ట్రం జైపూర్ లో భార్యతో కలిసి నివసిస్తున్నాడు. అతని భార్య ఉపాధ్యాయురాలు. కాగా.. ఈ జవాన్ భార్యకు తెలీకుండా మరో మహిళతో ప్రేమాయణం మొదలుపెట్టాడు. ఆమెతో తరచూ మాట్లాడుతుండడంతో అతడి భార్యకు అనుమానం వచ్చింది. 

తన భర్తకు వేరొకరితో సంబంధం ఉందని గుర్తించిన ఆమె భర్తను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవాలని నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో ఇటీవల భర్త ఫోన్‌లో మాట్లాడుతూ.. పలానా చోటకు రమ్మని తన ప్రేయసికి చెప్పాడు. ఇది తెలుసుకున్న భార్య కొద్దిసేపటికి భర్త వెళ్లిన లాడ్జికి వెళ్లింది. లాడ్జి నిర్వాహకులతో మాట్లాడి వారు ఉన్న గది మారుతాళం తీసుకుని పైకి వెళ్లింది. పోలీసుల సహాయంతో తాళం తెరచి చూడగా ఇద్దరూ భర్త, అతడి ప్రేయసి నగ్నంగా ఉన్నారు. ఈ దృశ్యాలను వీడియో తీసింది. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

తీసిన వీడియోను పలువురికి పంపండంతో అవి నెట్టింట్లో చక్కర్లు కొట్టింది. రాజస్థాన్‌లో ఆ వీడియోలు వైరల్‌గా మారాయి. అయితే ఆ వీడియోలు బయటకు రావడంతో తన పరువు పోయిందని అతడి ప్రేయసి ఉల్టా భార్యపై ఫిర్యాదు చేసింది. ఆ వీడియోలు చూసి తన బంధువులు మనస్తాపానికి గురయ్యాయని వాపోయింది. ప్రస్తుతం ఈ పంచాయితీ శాస్త్రీనగర్‌ పోలీస్‌స్టేషన్‌లో కొనసాగుతోంది.

PREV
click me!

Recommended Stories

Ayodhya Ram Mandir Reopens After Lunar Eclipse:చంద్రగ్రహణం అనంతరం తెరుచుకున్న అయోధ్య| Asianet Telugu
Total Lunar Eclipse: 2026 లో మొదటి చంద్రగ్రహణం చూసేందుకు ఎగబడ్డ జనం| Asianet News Telugu