పోలీసులపై ఆగ్రహంతో... ఓ మహిళ ఏం చేసిందంటే...

Published : Sep 17, 2019, 07:40 AM IST
పోలీసులపై ఆగ్రహంతో... ఓ మహిళ ఏం చేసిందంటే...

సారాంశం

 నిందితులను అరెస్టు చేయకపోవడంతో ఆమె పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. గత రెండూ వారాలనుంచి ప్రతి రోజు గుండు కొట్టించుకుంటూ నిరసన వ్యక్తం చేస్తోంది. నిందితులను అరెస్టు చేసేంత వరకూ ఇలాగే చేస్తూ ఉంటానని ఆమె తేల్చిచెప్పింది.

తన  తండ్రిని హత్య చేసిన వారిని అరెస్టు చేయడంలో పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ ఓ మహిళ వినూత్నంగా నిరసన వ్యక్తం చేసింది. పోలీసులపై కోపంతో.. ప్రతి రోజూ ఓ మహిళ గుండు చేయించుకుంది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.... పునీత్ సింగ్ అనే మహళ ఝాన్సీ జిల్లాలో నివసిస్తోంది. కాగా..ఆగస్టు 22న ఆమె తండ్రి జోగేందర్ అచేతనంగా పడి ఉండటాన్ని గమనించిన కొందరు ఈ విషయాన్ని పునీత్‌కు తెలియజేశారు. ఘటన స్థలానికి చేరుకున్న ఆమె..తండ్రిని ఆసుపత్రికి తరలించింది. అయితే అప్పటికే అతడు మృతి చెందినట్టు డాక్టర్లు తెలిపారు. మరోవైపు తండ్రి వద్ద ఉండే సెల్‌ఫోన్ కూడా కనిపించడం లేదన్న విషయాన్ని పునీత్ సింగ్ గుర్తించింది.
 
తన తండ్రి వద్ద నమ్మకస్తుడిగా ఉండే రాజీవ్ ఖండేల్వాల్, అతడి కుమారుడు ఈ హత్య చేసారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ..కేసు నమోదు చేసేందుకు మొదట పోలీసులు వెనకాడినట్టు ఆమె తెలిపింది. ఈ మొత్తం ఉదంతంలో పోలీసుల పాత్ర కూడా ఉండొచ్చని ఆమె ఆరోపించింది. ఇంత కాలం గడుస్తున్నా నిందితులను అరెస్టు చేయకపోవడంతో ఆమె పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. గత రెండూ వారాలనుంచి ప్రతి రోజు గుండు కొట్టించుకుంటూ నిరసన వ్యక్తం చేస్తోంది. నిందితులను అరెస్టు చేసేంత వరకూ ఇలాగే చేస్తూ ఉంటానని ఆమె తేల్చిచెప్పింది.

PREV
click me!

Recommended Stories

Census 2027 : వచ్చేస్తున్న డిజిటల్ జనాభా లెక్కలు.. పేపర్ లేదు, పెన్ను లేదు.. అంతా యాప్ ద్వారానే !
IndiGo : ఇండిగో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సీఈఓ పీటర్‌ ఎల్బర్స్‌ క్షమాపణలు.. బిగ్ అప్డేట్ !