
న్యూఢిల్లీ: గతేడాది మే 29న పంజాబ్‌కు చెందిన ప్రముఖ సింగ్ సిద్దూ మూసేవాలాను పట్టపగలే దారుణంగా హతమార్చిన సంగతి తెలిసిందే. చుట్టుపక్కల నుంచి ఆ దుండగులు చుట్టుముట్టి కాల్పులు జరిపి కారులోనే సిద్దూను చంపేశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ మర్డర్ కేసులో బిష్ణోయ్ లారెన్స్ గ్యాంగ్ ప్రమేయం ఉన్నదని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే పలువురిని అరెస్టు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. ఇదిలా ఉండగా ఈ హత్య కేసులో నిందితులుగా ఉన్న ఇద్దరు జైలులోనే హత్యకు గురవడం సంచలనంగా మారింది.
Also Read: మెడికో ప్రీతి కేసు .. నా బిడ్డ బతకదంటున్నారు : కన్నీటి పర్యంతమైన తండ్రి
పంజాబ్ తార్న్ తరణ్ జిల్లాలోని గోయింద్వాల్ సాహిబ్ సెంట్రల్ జైలులో ఖైదీల మధ్య గొడవ జరిగింది. ఇందులో ఇద్దరు మరణించారు. మరొకరు గాయపడ్డారు. ఈ ముగ్గురూ ఒకే గ్రూప్‌నకు చెందినవారని సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు గుర్మీత్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఇందులో ఇద్దరు సిద్దూ మూసేవాలా మర్డర్ కేసుతో సంబంధం ఉన్నవారని వివరించారు. అయితే, వారిపై మరికొన్ని ఇతర కేసులూ ఉన్నట్టు చెప్పారు.