కర్ణాటక సీఎంగా సిద్దరామయ్య, డిప్యూటీగా డీకేశి ప్రమాణం.. రాహుల్, ప్రియాంక, కమల్‌తో పాటు హాజరైన ప్రముఖులు వీరే..

Published : May 20, 2023, 12:50 PM ISTUpdated : May 20, 2023, 01:25 PM IST
కర్ణాటక సీఎంగా సిద్దరామయ్య, డిప్యూటీగా డీకేశి ప్రమాణం.. రాహుల్, ప్రియాంక, కమల్‌తో పాటు హాజరైన ప్రముఖులు వీరే..

సారాంశం

కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్దరామయ్య, డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేశారు.

కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్దరామయ్య, డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. వారి చేత కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ ప్రమాణం చేయించారు. వీరితో పాటు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. 

ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, తమిళనాడు  ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, ఛత్తీస్‌ఘడ్ సీఎం భూపేష్ బఘేల్, హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు,  రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా, ప్రముఖ సినీ నటుడు కమల్ హాసన్‌, సీపీఐ నేత డి రాజా, సీపీఐ(ఎం) సీతారాం ఏచూరిలతో పాటు పలువురు కాంగ్రెస్ సీనియర్ నాయకులు, విపక్ష నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా  సిద్దరామయ్య, డీకే శివకుమార్‌లకు పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు. 

ఇక, మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసినవారిలో జి పరమేశ్వర (ఎస్సీ), కేహెచ్ మునియప్ప(ఎస్సీ), కేజే జార్జ్(మైనారిటీ-క్రిస్టియన్), ఎంబీ పాటిల్(లింగాయత్), సతీష్ జార్కిహోళి  (ఎస్‌టీ-వాల్మీకి), ప్రియాంక్ ఖర్గే (ఎస్సీ- కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే కుమారుడు), రామలింగా రెడ్డి (రెడ్డి), బీజెడ్ జమీర్ అహ్మద్ ఖాన్(మైనారిటీ-ముస్లిం) ఉన్నారు.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం