ఆ పార్టీ కార్యకర్తలంతా వ్యభిచారులే.. మాజీ సీఎం వివాదాస్పద కామెంట్స్

Published : Aug 31, 2019, 11:55 AM IST
ఆ పార్టీ కార్యకర్తలంతా వ్యభిచారులే.. మాజీ సీఎం వివాదాస్పద కామెంట్స్

సారాంశం

జేడీఎస్‌ కార్యకర్తలంతా వ్యభిచారులే అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘డాన్స్‌ రాని వ్యభిచారి.. వేదిక నృత్యం చేయడానికి అనుకూలంగా లేదని చెప్తుంది. అలానే జేడీఎస్‌ కార్యకర్తలు తమ చేతకానితనాన్ని కప్పి పుచ్చుకోడానికి నాపై ఆరోపణలు చేస్తున్నారు’ అంటూ సిద్ధరామయ్య మండి పడ్డారు.

కర్ణాటక మాజీ సీఎం సిద్ధారామయ్య మరోసారి వివాదంలో ఇరుక్కున్నారు. జేడీఎస్ పార్టీ కార్యకర్తలను కించపరిచేలా మాట్లాడి విమర్శలు ఎదుర్కొంటున్నారు. జేడీఎస్‌-కాంగ్రెస్‌ సంకీర్ణ ప్రభుత్వం కూలిపోవడానికి సిద్ధరామయ్యే మూలకారకుడంటూ జేడీఎస్‌ కార్యకర్తలు ఆరోపిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం ఓ విలేకరి దీని గురించి సిద్ధరామయ్యను ప్రశ్నించాడు. 

దానికి ఆయన మండిపడుతూ.. జేడీఎస్‌ కార్యకర్తలంతా వ్యభిచారులే అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘డాన్స్‌ రాని వ్యభిచారి.. వేదిక నృత్యం చేయడానికి అనుకూలంగా లేదని చెప్తుంది. అలానే జేడీఎస్‌ కార్యకర్తలు తమ చేతకానితనాన్ని కప్పి పుచ్చుకోడానికి నాపై ఆరోపణలు చేస్తున్నారు’ అంటూ సిద్ధరామయ్య మండి పడ్డారు.

కర్ణాటకలో జేడీఎస్‌-కాంగ్రెస్‌ అధ్వర్యంలో ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వం 14 నెలల తర్వాత ఈ ఏడాది జూలైలో కుప్పకూలిన సంగతి తెలిసిందే. నాటి నుంచి జేడీఎస్‌ శ్రేణులు సిద్ధరామయ్య మీద విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సిద్ధారమయ్య ఇలా జేడీఎస్ కార్యకర్తలను కించపరచడం తీవ్ర వివాదాస్పదమైంది.
 

PREV
click me!

Recommended Stories

38 మందికి మరణ శిక్ష గుజరాత్ హై కోర్ట్ సంచలన తీర్పు | Historic Verdict in 2008 Ahmedabad Incident
ఇండోనేషియాలో ప్రంబనన్ ఆలయందర్శించిన మోదీ పవర్ ఫుల్ స్పీచ్ | PM Narendra Modi Prambanan Temple Visit