మహిళా కానిస్టేబుల్ పై ఎస్ఐ అత్యాచారం..!

Published : May 29, 2021, 07:54 AM IST
మహిళా కానిస్టేబుల్ పై ఎస్ఐ అత్యాచారం..!

సారాంశం

ఈ దారుణ సంఘటన ఒడిశాలోని బాలేశ్వర్ జిల్లా గోపాలపూర్ అవుట్ పోస్టులో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను బాలేశ్వర్ ఎస్పీ సుధాంశు శేఖర్ వివరించారు.  


ఆపదలో ఉన్నవారిని రక్షించాల్సిందిపోయి.. భక్షించాలని చూస్తున్న వారు రోజు రోజుకీ పెరిగిపోతున్నారు. ప్రజల సంగతి వరకు పక్కన పెడితే... తమ తో కలిసి పనిచేస్తున్న సహోద్యోగులను కూడా వదిలిపెట్టడం లేదు. తాజాగా.. ఓ ఎస్ఐ మహిళా కానిస్టేబుల్ పై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన ఒడిశాలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఈ దారుణ సంఘటన ఒడిశాలోని బాలేశ్వర్ జిల్లా గోపాలపూర్ అవుట్ పోస్టులో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను బాలేశ్వర్ ఎస్పీ సుధాంశు శేఖర్ వివరించారు.

యస్ తుఫాను నేపథ్యంలో ప్రజలకు సేవలందించేందుకు గోపాలపూర్ అవుట్ పోస్టులో అదనపు సిబ్బందిని నియమించారు. ఇందులో బాధిత మహిళా కానిస్టేబుల్ కూడా ఉన్నారు. అక్కడ విధుల్లో ఉన్న ఆమెపై బుధవారం రాత్రి ఎస్ఐ బన్సీధర్ ప్రధాన్ అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనిపై ఆమె గురువారం కంటాపడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఎస్పీ ఆదేశాల మేరకు దర్యాప్తు నిర్వహించిన అధికారులు ఎస్ఐ ని అరెస్టు చేశారు. 

PREV
click me!

Recommended Stories

Post Office Scheme: రోజుకు రూ.300 దాచితే చాలు.. చేతికి రూ. 6.42 లక్షలు.. పోస్టాఫీసు అద్భుత స్కీమ్
Ration Card: భారీగా రేష‌న్ కార్డుల‌ను నిలిపివేయ‌నున్న ప్ర‌భుత్వం.. జాబితాలో మీది ఉందా.?