ఇది ముమ్మాటికీ  లవ్‌ జీహాదే..

Published : Nov 25, 2022, 11:03 AM ISTUpdated : Nov 25, 2022, 11:13 AM IST
ఇది ముమ్మాటికీ  లవ్‌ జీహాదే..

సారాంశం

దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన శ్రద్ధా వాకర్ హత్య కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. శ్రద్ధాను ఆమె లవర్ అఫ్తాబ్ పూనావాలా అత్యంత దారుణంగా హత్య చేశాడు. ఈ హత్యపై ఢిల్లీ పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ తరుణంలో రాజకీయ నాయకులు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఈ తరుణంలో బీజేపీ నాయకులు ఈ హత్యను లవ్ జీహాద్ గా చెబుతున్నారు

దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన శ్రద్ధా వాకర్ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలన సృష్టించింది. అఫ్తాబ్ పూనావాలా తో సహాజీవనం చేస్తున్న శ్రద్ధాను అత్యంత దారుణంగా హత్య చేశాడు. ఈ కేసులో ఢిల్లీ పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.  ఈ హత్యకు పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో రాజకీయ నాయకులు తమ స్వరం కలిపారు.

ఈ క్రమంలో బీజేపీలు, ఎంఐఎం లు తమదైన శైలిలో స్పందిస్తు్న్నారు. లవ్‌ జీహాద్‌ అని దేశమంతటా నిరసనలు వెల్లువెత్తాయి. దీంతో ఘటనకు మతం రంగు పులుముకుంది. తాజాగా అస్సాం ముఖ్యమంత్రి, బిజెపి నాయకుడు హిమంత బిస్వా శర్మ తనదైన శైలిలో స్పందించారు. ఇది ముమ్మాటికి లవ్‌ జీహాదే అని సంచలన వ్యాఖ్యలు చేశారు. గుజరాత్ రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో కూడా  టాఫిక్ పై మాట్లాడుతున్నారు. లవ్ జిహాద్‌ను అరికట్టేందుకు కఠిన చట్టాలు తేవాలని డిమాండ్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది.

సీఎం హిమంత బిస్వా శర్మ  మీడియాతో శ్రద్ధా వాకర్ హత్య కేసుపై  స్పందించారు. ఇది మహిళల భద్రతకు సంబంధించిన అంశం, ఈ హత్యలో "లవ్ జిహాద్" అంశం ఇమిడి ఉందని అన్నారు. పెళ్లి కోసం శ్రద్ధను ఢిల్లీకి తీసుకొచ్చిన అఫ్తాబ్.. ఆమె మృతదేహాన్ని 35 ముక్కలుగా చేసి ఫ్రిజ్‌లో ఉంచాడు. ఆపై అదే గదిలోకి మరో మహిళను తీసుకొచ్చి గడిపాడు. ఇది మహిళలకు సంబంధించిన భద్రత, ఇది నా కుమార్తె భద్రతకు సంబంధించినది. ముమ్మాటికీ ఇది లవ్‌ జీహాదే అని సంచలన వ్యాఖ్యలు చేశారు. లవ్-జిహాద్‌ను ఆపడానికి కఠినమైన చట్టాలు చేయాలని డిమాండ్ చేశారు.  

ఈ నేపథ్యంలో  శ్రద్ధా వాకర్‌ హత్యోదంతంపై ఎంఐఎం చీఫ్‌, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ కూడా స్పందించారు. ఇది లవ్‌ జిహాద్‌ ఘటన కానేకాదన్నారు. ఈ హత్యపై బీజేపీ నాయకులు రాజకీయం చేస్తున్నాయని, ఇది లవ్ జీహాద్ కాదని ఒక మహిళపై దోపిడీ, వేధింపుల సమస్య అని ఓవైసీ అన్నారు. 

ఇటీవల గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో ప్రచారంలో పాల్గొన్న అస్సాం ముఖ్యమంత్రి.. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పించారు. రాహుల్ చూడటానికి ఇరాక్ మాజీ నియంత సద్దాం హుస్సేన్‌ ఉన్నడని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతకంటే ముందు.. కూడా పలుమార్లు విమర్శలు గుప్పించారు. రాహుల్ రంగంలోకి దిగడానికి  గ్లౌసులు, ప్యాడ్‌లను ధరిస్తారు. కానీ.. గ్రౌండ్ లోకి రాకుండానే పెవిలియన్‌కు వెళ్తారని వ్యంగంగా కామెంట్స్ చేశారు. గుజరాత్‌లో ఎన్నికలు జరుగుతున్నప్పుడు రాహుల్ గాంధీ మధ్యప్రదేశ్‌లో మేఘాపాట్కర్‌తో కలిసి తిరుగుతున్నారని విమర్శించారు.  

అఫ్తాబ్ అమీన్ పూనావాలా వాకర్ (27)ని గొంతు నులిమి చంపి, ఆమె మృతదేహాన్ని 35 ముక్కలుగా నరికి, దక్షిణ ఢిల్లీలోని మెహ్రౌలీలోని తన నివాసంలో దాదాపు మూడు వారాల పాటు 300 లీటర్ల ఫ్రిజ్‌లో ఉంచి, ఆపై నగరానికి తీసుకువచ్చాడు. రాత్రి. అడ్డంగా విసిరారు. మేలో వాకర్ హత్యకు గురయ్యాడు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Viral News: ఈ గ్రామంలో మ‌హిళ‌లు 5 రోజులు న‌గ్నంగా ఉంటారు.. వింత ఆచారం ఎక్క‌డంటే
Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌