కరోనా టీకా కావాలంటే.. ఆధార్ లింక్ తప్పనిసరి..!

By telugu news teamFirst Published Jan 11, 2021, 1:01 PM IST
Highlights

కరోనా టీకా కోసం ప్రభుత్వం కోవిన్ అనే యాప్‌ప్లాట్ ఫారం రూపొందించింది. ఈ వేదిక ద్వారా దేశంలోని ప్రజలకు టీకాలు వేయనున్నారు. అదేవిధంగా ఈ యాప్‌లో టీకాకు సంబంధించిన అన్ని వివరాలు పొందుపరిచారు. 

కరోనా టీకాకి సర్వం సిద్ధమైంది. మరి కొద్ది రోజుల్లో వ్యాక్సిన్ పంపిణీ మొదలుకానుంది. ఈనెల 16 నుంచి దేశంలో కరోనా టీకాలు వేసే కార్యక్రమం ప్రారంభం కానుంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం అన్నిరాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు దిశానిర్దేశాలను జారీ చేసింది. 

కరోనా టీకా కోసం ప్రభుత్వం కోవిన్ అనే యాప్‌ప్లాట్ ఫారం రూపొందించింది. ఈ వేదిక ద్వారా దేశంలోని ప్రజలకు టీకాలు వేయనున్నారు. అదేవిధంగా ఈ యాప్‌లో టీకాకు సంబంధించిన అన్ని వివరాలు పొందుపరిచారు. 

కరోనా టీకా తీసుకునేవారు వారి మొబైల్ నంబరుకు ఆధార్ నంబర్ లింక్ చేయడం తప్పనిసరని ప్రభుత్వం తెలిపింది. అయితే ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేయనుందని సమాచారం. కాగా 2018లో ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి చాలామంది తమ మొబైల్ నంబరుకు ఆధార్ నంబర్ లింక్ చేసుకున్నారు. అయితే కొందరు ఈ నాటికీ మొబైల్ నంబర్‌తో ఆధార్ నంబర్ లింక్ చేయలేదు. వీరంతా ఇప్పుడు కరోనా టీకా కోసం ఈ ప్రక్రియ అనుసరించాల్సివుంటుంది.

ఫోన్ నెంబర్ ని ఆధార్ తో అనుసంధానం చేసుకున్న వారికి మాత్రమే కరోనా వ్యాక్సిన్ వేస్తామంటూ ప్రభుత్వాలు చెబుతుండటం గమనార్హం. 

click me!