భార్య లావుగా ఉందని ఇంట్లో నుంచి గెంటేసి..

Published : Sep 24, 2020, 07:30 AM IST
భార్య లావుగా ఉందని ఇంట్లో నుంచి గెంటేసి..

సారాంశం

రు నెలలపాటు వారి సంసారం బాగానే సాగింది. ఆ తర్వాత భార్యను వేధించడం మొదలుపెట్టాడు.

భార్య లావుగా ఉందని ఓ భర్త.. కట్టుకున్న భార్యను ఇంటి నుంచి గెంటేశాడు. ఈ దారుణ సంఘటన గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ లో చోటుచేసుకుంది.  పూర్తి వివరాల్లోకి వెళితే...  అహ్మదాబాద్, మహిళా వెస్ట్ పోలీస్ స్టేషన్  పరిధిలో ఉన్న రెసిడెంట్ కు చెందిన ఓ మహిళకు 2017లో వివాహం జరిగింది.  ఆరు నెలలపాటు వారి సంసారం బాగానే సాగింది. ఆ తర్వాత భార్యను వేధించడం మొదలుపెట్టాడు.

లావుగా ఉన్నావంటూ తిట్టడం, వేధించడం మొదలుపెట్టాడు. తన తల్లిదండ్రుల బలవంతం కారణంగానే ఆమెను పెళ్లి చేసుకున్నానని చెప్పి ఎగతాళి చేసేవాడు. ఓ నెల క్రితం ఇళ్లు కొనడానికి ఆమె వద్దనుంచి దాదాపు 3 లక్షల రూపాయలు ఇప్పించుకున్నాడు. ఆ వెంటనే ఆమెను ఇంటినుంచి బయటకు గెంటేశాడు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించి, భర్త, అతడి సోదరులపై ఫిర్యాదు చేసింది. కాగా.. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
 

PREV
click me!

Recommended Stories

Viral News: చెత్త కుప్ప‌లో చాక్లెట్లు, ఒక్క‌సారిగా ఎగ‌బ‌డ్డ జ‌నం.. అస‌లు విష‌యం తెలిస్తే
Who is Best PM of India: దేశంలో బెస్ట్ ప్రధాని ఎవరు? సీఎంలలో ఆ ముగ్గురే తోపు.. సీజేపీ బాస్ హాట్ కామెంట్స్