
Assam Woman Kills Husband, Mother-In-Law: అక్రమ సంబంధాలు పచ్చని కాపురాల్లో చిచ్చురేపుతున్నాయి. అక్రమ సంబంధాలతో ఎన్నో కుటుంబాలు రొడ్డున పడుతున్న నేపథ్యంలో ఒక షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ మహిళ తన ప్రియుడి మోజులో కట్టుకున్న భర్త, తన అత్తను చంపేసింది. వారి శరీర భాగాలను ఫ్రిజ్ లో దాచిపెట్టింది. భర్త అమరజ్యోతి డే, అత్త శాంకరీ డేలను హత్య చేసిన మూడు రోజుల తర్వాత నిందితురాలు వందనా కలితా, ఆమె ప్రియుడు శరీర భాగాలను పొరుగున ఉన్న మేఘాలయలోని చిరపుంజికి తీసుకెళ్లారని పోలీసులు తెలిపారు.
వివరాల్లోకెళ్తే.. ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తను, తన అత్త ప్రాణాలు తీసిన ఘటన అసోంలో చోటుచేసుకుంది. గౌహతిలోని నూన్మతిలో ఓ మహిళ తన భర్త, అత్తమామలను చంపి, వారి మృతదేహాలను కట్ చేసి ఫ్రిజ్ లో దాచిందని పోలీసులు తెలిపారు. వందనా కలిత అనే మహిళ వివాహేతర సంబంధం పెట్టుకుందనీ, ఈ క్రమంలోనే ఈ దారుణానికి పాల్పడిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై మరింత లోతుగా విచారణ జరుపుతున్నామనీ, దీని తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.
భర్త అమరజ్యోతి డే, అత్త శాంకరి డేలను హత్య చేసిన మూడు రోజుల తర్వాత వందనా కలితా, ఆమె ప్రియుడు మృతదేహాన్ని గౌహతికి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న పొరుగున ఉన్న మేఘాలయలోని చిరపుంజికి తీసుకెళ్లారు. అక్కడ ఇద్దరూ మృతుల శరీర భాగాలను పడేశారు. వాటిని పోలీసులు కనుగొన్నారు. పోలీసు బృందం మేఘాలయలోని చిరపుంజిలోని సంఘటనా స్థలానికి వెళ్లిందని, అక్కడ ఆమె, ఆమె ప్రియుడు తల్లి, ఆమె కుమారుడి శరీర భాగాలను పడేశారని పోలీసు అధికారి ఒకరు తెలిపారు.
మృతదేహాలను ముక్కలు ముక్కలుగా నరికే ముందు వందన వారిని చంపింది. అనంతరం ఆమె శరీర భాగాలను ఫ్రిజ్ లో భద్రపరిచిందని పోలీసులు తెలిపారు. కాగా, గత ఏడాది ఢిల్లీలో శ్రద్ధా వాకర్ ను ఆమె ప్రియుడు అఫ్తాబ్ పూనావాలా హత్య చేశాడు. ఈ ఘటనలో ఆమె శరీరాన్ని ముక్కలు చేసి ఫ్రిజ్ లో పెట్టి కొన్ని రోజుల తర్వాత పారేయడం వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు అసోంలో చోటుచేసుకున్న ఘటన దీనిని పోలి ఉంది. ఆమె మృతదేహాన్ని కూడా కోసి ఫ్రిజ్ లో దాచింది. అలాగే దేశరాజధాని ఢిల్లీలో మరో ఘటన కూడా ఇలాంటి కోవకు చెందినది వెలుగుచూసింది. నిక్కీ యాదవ్ అనే మహిళను ఆమె భాగస్వామి సాహిల్ గెహ్లాట్ హత్య చేసి, ఆమె మృతదేహాన్ని ఢిల్లీలోని తన రెస్టారెంట్లో ఫ్రిజ్ లో ఉంచాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదుచేసి, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.