కరోనా పాజిటివ్ అని తెలీగానే కంగారులో యాక్సిడెంట్..

By telugu news teamFirst Published Apr 14, 2021, 10:22 AM IST
Highlights

ఓ మహిళ తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని తెలిసి కంగారులో రోడ్డు ప్రమాదానికి గురైంది. 

కరోనా మహమ్మారి దేశంలో విజృంభిస్తోంది. కరోనా సెకండ్ వేవ్ మరింత ఎక్కువగా విజృంభిస్తోంది. కాగా.. ఓ మహిళ తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని తెలిసి కంగారులో రోడ్డు ప్రమాదానికి గురైంది. కారు డ్రైవింగ్ చేస్తున్న ఓ మహిళ తన ఫోన్‌కు వచ్చిన కొవిడ్ పాజిటివ్ రిపోర్టు చూసి షాక్ కు గురైన ఘటన కేరళ రాష్ట్రంలోని కొల్లం జిల్లా కడక్కల్ పట్టణంలో వెలుగుచూసింది. 

పూర్తి వివరాల్లోకి వెళితే... కడక్కల్ పట్టణంలోని అంచల్ ప్రాంతంలోని ఓ ప్రైవేటు లాబోరేటరికీ కారులో వచ్చిన 40 ఏళ్ల మహిళ కరోనా పరీక్ష చేయించుకొని తిరిగి ఇంటికి పయనమైంది. మహిళ కారు నడుపుతుండగా, ఆమె ఫోన్ కు కొవిడ్ పాజిటివ్ అంటూ మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ చూసిన మహిళ షాక్ కు గురై కంట్రోల్ తప్పిపోయి కారును విద్యుత్ స్తంభానికి ఢీకొట్టింది.

అంతే కారు విద్యుత్ స్తంభంతోపాటు బోల్తాపడింది. ముఖంపై గాయాల పాలైన మహిళకు కరోనా పాజిటివ్ ని తేలడంతో ఆమెను అగ్నిమాపక శాఖ అంబులెన్సులో తరలించేందుకు అధికారులు ముందుకు రాలేదు. ఫైర్ డిపార్టుమెంట్ అధికారులు వచ్చి కరోనా పాజిటివ్ మహిళకు పీపీఈ కిట్ ఇచ్చారు. ప్రమాదం జరిగి గంట గడచినా కొవిడ్ భయంతో క్షతగాత్రురాలిని ఆసుపత్రికి తరలించలేదు. అంతలో మహిళ బంధువు ఒకరు వచ్చి ఆమెను ద్విచక్రవాహనంపై ఇంటికి తీసుకువెళ్లారు.
 

click me!