లింగాయత్ మఠాధిపతికి జ్యుడీషియల్ కస్టడీ.. ఆ రోజే బెయిల్ పిటిష‌న్ పై విచార‌ణ‌

By Rajesh KFirst Published Sep 5, 2022, 1:43 PM IST
Highlights

ఇద్దరు మైనర్ విద్యార్థులను లైంగిక వేధించార‌నే ఆరోపణలపై అరెస్టయిన లింగాయత్ మఠాధిప‌తి  శివమూర్తి మురుగ శరణారావును కర్ణాటకలోని చిత్రదుర్గలోని స్థానిక కోర్టు సెప్టెంబర్ 14 వరకు జ్యుడీషియల్ కస్టడీకి అప్పగించింది.

కర్ణాటకలోని ప్రముఖ‌ లింగాయత్ మఠాధిపతిపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో.. రాష్ట్ర‌వ్యాప్తంగా ప్ర‌కంపనలు రేగుతున్నాయి. మైనర్లపై లైంగికంగా వేధించ‌డాన్ని చిత్రదుర్గలోని ప్ర‌ముఖ లింగాయత్ మఠాధిపతి శ్రీ శివమూర్తి మురుగ శరణుపై పోక్సో యాక్ట్ కింద కేసు న‌మోదు చేసి.. గ‌త వారం అరెస్టు చేసిన విష‌యం తెలిసిందే. తాజాగా ఆయ‌నను చిత్రదుర్గ జిల్లా కోర్టు సెప్టెంబర్ 14 వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపింది.  

శివమూర్తిని పోలీసు కస్టడీకి తీసుకున్న చిత్రదుర్గ పోలీసులు సోమవారం ఉదయం కోర్టులో హాజరుపరిచారు. ఈ త‌రుణంలో విచార‌ణ చేప‌ట్టిన కోర్టు శివమూర్తిని తొమ్మిది రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీకి అప్పగించాలని ఆదేశించింది. శివమూర్తిని ప్రశ్నించిన పోలీసు అధికారులు స్పాట్ మహజర్ కోసం మఠానికి తీసుకెళ్లారు. కోర్టు ముందు హాజరుపరిచి తమకు ఇకపై పోలీసు కస్టడీ అవసరం లేదని తెలియజేశారు. రెండో అదనపు జిల్లా సెషన్స్ జడ్జి బీకే కోమల అతడిని జ్యుడీషియల్ కస్టడీకి తీసుకోవాలని జైలు అధికారులను ఆదేశించారు. 

మ‌రోవైపు.. శివమూర్తి తరఫు న్యాయవాది దాఖలు చేసిన బెయిల్ పిటిష‌న్ పై సెప్టెంబర్ 7న విచార‌ణ జ‌ర‌గ‌నున్న‌ది. అభ్యంతరాలు ఏమైనా ఉంటే దాఖలు చేయాలని పోలీసులు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను కోరారు. జగద్గురువు మురుగరాజేంద్ర విద్యాపీఠం మహజరుల కోసం పోలీసులు ఆవరణలో ఉన్నందున ఆదివారం ప్రజల సందర్శనార్థం మూసివేయబడింది. సోమవారం ఉదయం మఠం ప్రజల సందర్శనార్థం తెరవబడింది.  
 
మైనర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన నేరం కింద శివమూర్తి శ‌ర‌ణును మూడు రోజుల క్రితం పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.. ఇద్దరు మైనర్ బాలికలు త‌మ‌పై శివ‌మూర్తి.. లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించారు.

 అరెస్టు అనంతరం.. కర్ణాటక ఏడీజీపీ, లా అండ్ ఆర్డర్, అలోక్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. ఈడీ కేసులో నిర్దేశించిన విధానాన్ని అనుసరిస్తామని చెప్పారు. వైద్య పరీక్ష, పరీక్ష విధానం నిబంధనల ప్రకారం ఉంటుంది. వారిని కూడా న్యాయమూర్తి ముందు హాజరుపరచనున్నారు.
 
అయితే, కర్ణాటక మురుగమఠ్ నిర్వాహకుడు ఎస్కే బసవరాజన్, ఆయన భార్య కలిసి కుట్ర పన్నార‌నీ మఠం అధికారులు ఆరోపించారు. ఈ క్ర‌మంలో ఎస్కే బసవరాజన్ తో పాటు ఆయన భార్య సౌభాగ్యపై కూడా ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది. మ‌రోవైపు.. బసవరాజన్ పై మురుగమఠం వార్డెన్ రష్మీ అత్యాచారం, అపహరణ కేసులు పెట్టడం గమనార్హం.

click me!