జొమాటో కేసులో ట్విస్ట్... ఆమె ముక్కు ఆమే పగలకొట్టుకుందా..?

Published : Mar 12, 2021, 02:55 PM ISTUpdated : Mar 12, 2021, 03:27 PM IST
జొమాటో కేసులో ట్విస్ట్... ఆమె ముక్కు ఆమే పగలకొట్టుకుందా..?

సారాంశం

సదరు మహిళా కష్టమర్.. కావాలని ఆమెకు ఆమె ముక్కుపై కొట్టుకొని గాయం చేసుకుందని అతను చెప్పడం గమనార్హం. 

జొమాటో ఫుడ్ డెలివరీ బాయ్.. తనపై దాడి చేశాడంటూ ఓ మహిళ ఇటీవల సంచలన కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. అయితే.. ఈ కేసులో తాజాగా కొత్త ట్విస్ట్ వచ్చి పడింది.

సదరు మహిళా కష్టమర్.. కావాలని ఆమెకు ఆమె ముక్కుపై కొట్టుకొని గాయం చేసుకుందని అతను చెప్పడం గమనార్హం. 

‘‘ఆమెకు భోజనం అందించిన తర్వాత బిల్లు చెల్లించమని అడిగాను. అంతేకాదు ట్రాఫిక్‌జాం వల్ల ఆలస్యమైందని, అందుకు నన్ను క్షమించమని కోరాను కూడా. కానీ ఆమె ఫుడ్‌ తీసుకునేందుకు నిరాకరించారు. ఎలాగోలా ఒప్పించాను. అంతలోనే ఆమె ఆర్డర్‌ క్యాన్సిల్‌ చేసినట్లు నాకు సమాచారం అందింది. దీంతో ఫుడ్‌ ప్యాకెట్‌ తిరిగి ఇవ్వాల్సిందిగా కోరాను. కానీ, నేను ఎంతగా అడిగినా తను సరిగా స్పందించలేదు. ఇక లాభం లేదనుకుని తిరిగి వెళ్దామని నిర్ణయించుకున్నాను. అంతలోనే హిందీలో తిట్టడం మొదలుపెట్టారు. నన్ను నెట్టివేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆమె చేతివేలికి ఉన్న ఉంగరం ముక్కుకు తగిలి రక్తం వచ్చింది. ఆమె ముఖాన్ని సరిగ్గా పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. నేను తనపై చేయి చేసుకోలేదని స్పష్టంగా తెలుస్తుంది’’ అని చెప్పుకొచ్చాడు.  ఇక కేసులో ఇరుక్కున్న కారణంగా చట్టపరంగా ముందుకు వెళ్లేందుకు, తనకు ఇప్పటికే రూ. 25 వేలు ఖర్చయ్యాయని ఆవేదన వ్యక్తం చేశాడు.

కాగా.. సదరు డెలివరీ బాయ్ పట్ల కంపెనీ కూడా సానుకూలంగా వ్యవహరించింది. అతని వల్ల ఇప్పటి వరకు ఒక్క ఫిర్యాదు కూడా అంతలేదని.. అతని రేటింగ్ కూడా చాలా ఎక్కువ అని చెప్పడం గమనార్హం. ఈ ఘటనపై తాము దర్యాప్తు చేస్తామని.. వారు పేర్కొన్నారు. 

PREV
click me!

Recommended Stories

గంటకు 9 కి.మీ స్పీడ్, 46 కి.మీ ప్రయాణానికి 5 గంటలా..! దేశంలోనే స్లోయెస్ట్ ట్రైన్ ఏదో తెలుసా?
Weather Update : మళ్లీ భారీ వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ అలర్ట్ !