ఐదేళ్ల ప్రేమ.. పెళ్లైన మూడు రోజులుకే మరో యువతితో...

Published : Mar 12, 2021, 10:34 AM IST
ఐదేళ్ల ప్రేమ.. పెళ్లైన మూడు రోజులుకే మరో యువతితో...

సారాంశం

తీరా విషయం ఏమిటని ఆరా తీయగా.. అతను మరో యువతితో పెళ్లికి సిద్ధమయ్యాడు. 

వారిద్దరూ దాదాపు ఐదు సంవత్సరాలపాటు ప్రేమించుకున్నారు. అయితే... వారి పెళ్లి పెద్దలు అంగీకరించలేదు. దీంతో... ఎవరికీ తెలీకుండా వారు పెళ్లి చేసుకున్నారు. పెళ్లైన మూడు రోజుల తర్వాత వరుడు కనిపించకుండా పోయాడు. తీరా విషయం ఏమిటని ఆరా తీయగా.. అతను మరో యువతితో పెళ్లికి సిద్ధమయ్యాడు. దీంతో.. న్యాయం కోసం యువతి పోరాటం మొదలుపెట్టింది. ఈ సంఘటన  కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

కర్ణాటక రాష్ట్రం బెంగళూరు గ్రామీణ జిల్లాలోని హోసకోటె తాలుకాకు  చెందిన ప్రమోద్, అనూజా ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ప్రమోద్‌ సీఆర్‌పీఎఫ్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. వీరి పెళ్లికి ఇరుకుటుంబాలు అంగీకరించలేదు.


దీంతో గతనెల 19న వీరు యలహంక సమీపంలోని సీఆర్‌పీఎఫ్‌ క్యాంపస్‌లో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. మూడు రోజుల పాటు ఆమెతో ఉన్న ప్రమోద్‌ ఆ తరువాత కనిపించలేదు. ఫోన్‌ కూడా స్విచాఫ్‌ అయ్యింది. ప్రమోద్‌ మరో పెళ్లికి సిద్ధమైనట్లు తెలుసుకున్న బాధితురాలు నందగుడి పోలీసు స్టేషన్‌ ఎదుట కుటుంబ సభ్యులతో ధర్నాకు దిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

PREV
click me!

Recommended Stories

Special Trains for Sankranti Festival: సంక్రాంతి సందర్భంగా ప్రత్యేక రైళ్లు| Asianet News Telugu
Real estate: నెల రోజుల్లో రూ. 20 ల‌క్ష‌ల లాభం.. అక్క‌డ రియ‌ల్ ఎస్టేట్ అంతలా ఎందుకు పెరుగుతోంది.?