ధనుంజయ్ ముండేపై లైంగిక ఆరోపణలు: పవార్ సీరియస్

Siva Kodati |  
Published : Jan 14, 2021, 05:58 PM IST
ధనుంజయ్ ముండేపై లైంగిక ఆరోపణలు: పవార్ సీరియస్

సారాంశం

మంత్రి ధనుంజయ్ ముండేపై వచ్చిన లైంగిక ఆరోపణల మహారాష్ట్రలో కలకలం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ దీనిని తీవ్రంగా పరిగణించారు. 

మంత్రి ధనుంజయ్ ముండేపై వచ్చిన లైంగిక ఆరోపణల మహారాష్ట్రలో కలకలం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ దీనిని తీవ్రంగా పరిగణించారు.

ఆయనపై వచ్చిన ఆరోపణలు చాలా సీరియస్ విషయమన్నారు. దీనిపై పార్టీ ముఖ్యులతో చర్చించి వారి అభిప్రాయాలు స్వీకరించిన తర్వాత తదుపరి నిర్ణయం తీసుకుంటామని పవార్ ప్రకటించారు.

కాగా, మంత్రి, ఎన్సీపీ నేత ధనంజయ్ ముండేపై ఓ యువతి లైంగిక ఆరోపణలు చేసింది. మంత్రిని బావగా పేర్కొన్న ఆ యువతి, తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆయన గత 14 ఏళ్లుగా అత్యాచారం చేశారంటూ ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

బాలీవుడ్‌లో సినిమా  అవకాశాలు ఇప్పిస్తానని ముండే తనను లోబర్చుకున్నారని ఆరోపించింది. ముండే నుంచి తన ప్రాణాలకు ముప్పు ఉందని, కాపాడాలని పోలీసులను కోరింది. అయితే ఈ ఆరోపణలను మంత్రి ధనంజయ్ ముండే ఖండించారు. 

PREV
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్