మహా కుంభమేళా 2025 కోసం ప్రయాగరాజ్ వచ్చిన శంకరాచార్య స్వామి అధోక్షజానంద్ దేవతీర్థ్ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ను పొగిడారు. ఆయన నేతృత్వంలోని యూపీ ప్రభుత్వం కుంభమేళా కోసం చేసిన ఏర్పాట్లను ప్రశంసించారు.
మహాకుంభ్ నగర్ : ప్రయాగరాజ్‌లో మహా కుంభమేళా ప్రారంభం కావడానికి ఇంకా కొన్ని రోజులే మిగిలివుంది. ఇప్పటికే మహాకుంభ్ నగర్‌కు సన్యాసుల రాక మొదలైంది. ఇలా చేరుకున్న సన్యాసులు యోగి ప్రభుత్వం చేసిన ఏర్పాట్లపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏర్పాట్ల గురించి గోవర్ధన్ మఠం పీఠాధిపతి జగద్గురు శంకరాచార్య స్వామి అధోక్షజానంద్ దేవతీర్థ్ స్పందిస్తూ యోగి భుత్వాన్ని ప్రశంసించారు. సీఎం యోగి ఒక సాధువు అని అన్నారు. ఆయన ఇక్కడికి పదే పదే వచ్చి ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు, దీనివల్ల భక్తులకు ధైర్యం, ఉత్సాహం పెరుగుతుందన్నారు. ఋషులు, మునులు, సాధకులకు సాధన, యజ్ఞం, తపస్సు చేసుకోవడానికి అనుకూల వాతావరణం లభిస్తుందన్నారు. మహాకుంభ్‌లో సాధువుల పూజలు, అనుష్టానాల పుణ్యం రాష్ట్రానికి, వారికీ దక్కుతుందన్నారు. సన్యాసులు, మహంతులందరూ ముఖ్యమంత్రి యశస్సు, కీర్తి, గౌరవం, ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రత్యేక ప్రార్థనలు చేస్తారన్నారు.
స్వామి అధోక్షజానంద్ మాట్లాడుతూ... గతంలో భారతదేశంలో మన ధార్మిక కార్యక్రమాలకు ప్రాధాన్యత లేని అన్యుల పాలన ఉండేదన్నారు. ఇప్పుడు మళ్ళీ భారతదేశంలో సనాతనాన్ని నమ్మేవారి పాలన వచ్చింది... దాని ప్రభావం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుందన్నారు. తీర్థక్షేత్రానికి రావాలంటే భక్తి, ఉండాలన్నాు. భక్తిలేని, అహంకారంతో ఉన్న పాలకుడు వస్తే, తీర్థం అతన్ని ఎప్పటికీ అంగీకరించదన్నారు.
ముఖ్యమంత్రి యోగిని ప్రశంసిస్తూ ఆయన ఎంతో ఉదారంగా మన గౌరవం కోసం ఏర్పాట్లు చేశారు...కాబట్టి మేము కూడా రాష్ట్ర శ్రేయస్సు, ఆర్థిక అభివృద్ధి, ఆయన అభ్యున్నతి కోసం ప్రత్యేకంగా కోరుకుంటున్నామన్నారు. రాక్షస ప్రవృత్తులు అనాదిగా సనాతనానికి హాని చేస్తూ, అపోహలు సృష్టిస్తూనే ఉన్నాయన్నారు. కొన్నిసార్లు అవి విజయం సాధించినట్లు కనిపిస్తాయి.. కానీ అలా జరిగినప్పుడల్లా దేవుడు అవతారం ఎత్తుతాడన్నారు. ఈ మహాకుంభ్ సనాతన ధర్మాన్ని నమ్మేవారికి శక్తినిస్తుంది... సనాతన జెండా ప్రపంచమంతా ఎగురుతుందన్నారు.
దేశంలో, రాష్ట్రంలో ధార్మిక ప్రదేశాల అభివృద్ధి గురించి మాట్లాడుతూ... మంచి పాలకుడు ఉంటే మన ప్రజలకు ఎక్కడా అన్యాయం జరగదన్నారు. మన మనోభావాలు ఎక్కడ దెబ్బతినకుండా పాలన సాగిస్తారన్నారు. దేవతలు, మఠాలు, మందిరాలు, గంగా, యమునా, హిమాలయాలు ఇవన్నీ మన ఆరాధ్య దైవాలు... వీటికి గౌరవం ఉంటేనే సమాజం సుఖంగా ఉంటుందన్నారు. గతంలో మన మఠాలు, మందిరాలను కూల్చివేసి సాంస్కృతిక చిహ్నాలను దెబ్బతీశారన్నారు. ఇలా అసుర శక్తులు ప్రబలినప్పుడు దైవ శక్తులు ఉద్భవిస్తాయన్నారు. ఇప్పుడు ఆనంద కాలంనడుస్తోందని... మన పాలకుడు అనుకూలం, మన ధర్మం అనుకూలం అని అధోక్షజానంద్ దేవతీర్థ్ పేర్కొన్నారు.