
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్- కర్ణాటక సరిహద్దుల్లోని పల్లవహళ్లి కట్ట సమీపంలో ప్రైవేటు బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 10 మంది మరణించగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని పావగడలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రైవేటు బస్సు.. వైఎస్ హోసకోట నుంచి పావగడకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.
ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 60 మంది వరకు ఉన్నట్టుగా సమాచారం అందుతోంది. అయితే ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. కాగా, ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.