జమ్మూలోని నర్వాల్ ప్రాంతంలో జంట పేలుళ్లు.. ఏడుగురికి గాయాలు..

Published : Jan 21, 2023, 12:27 PM ISTUpdated : Jan 21, 2023, 02:21 PM IST
 జమ్మూలోని నర్వాల్ ప్రాంతంలో జంట పేలుళ్లు.. ఏడుగురికి గాయాలు..

సారాంశం

జమ్మూలోని నర్వాల్ ప్రాంతంలో జంట పేలుళ్లు చోటుచేసుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది. శనివారం ఉదయం 15 నిమిషాల వ్యవధిలో జరిగిన రెండు పేలుళ్లలో ఏడుగురు గాయపడ్డారని సంబంధిత వర్గాలు తెలిపాయి. 

జమ్మూలోని నర్వాల్ ప్రాంతంలో జంట పేలుళ్లు చోటుచేసుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది. శనివారం ఉదయం 15 నిమిషాల వ్యవధిలో జరిగిన రెండు పేలుళ్లలో ఏడుగురు గాయపడ్డారని సంబంధిత వర్గాలు తెలిపాయి. జమ్మూ నగరంలోని నర్వాల్ ప్రాంతంలో పేలుళ్లు సంభవించాయని అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (జమ్మూ) చెప్పారు. ఆరుగురికి గాయాలైనట్లు ధృవీకరించారు. అయితే గాయాలతో ఏడుగురు ఆస్పత్రిలో చేరారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఉదయం 10.45 గంటల ప్రాంతంలో మొదటి పేలుడు సంభవించిందని.. ఆ తర్వాత మరో పేలుడు సంభవించిందని ఒక అధికారి  చెప్పారు. ఆ ప్రాంతాన్ని భద్రతా బలగాలు చుట్టుముట్టాయని.. సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని ఆ అధికారి తెలిపారు. 

మరమ్మతుల కోసం వర్క్‌షాప్‌కు పంపిన వాహనంలో తొలి పేలుడు సంభవించిందని ప్రత్యక్ష సాక్షి జస్వీందర్ సింగ్ తెలిపారు. పదిహేను నిమిషాల తరువాత సమీపంలోని మరో పేలుడు చోటుచేసుకుందని చెప్పారు. మొదటి పేలుడులో ఐదుగురు గాయపడ్డారని, రెండో పేలుడులో మరో ఇద్దరు గాయపడ్డారని ఆయన తెలిపారు.

PREV
click me!

Recommended Stories

100 కాదు 132 శాతం లక్ష్యం... యువతకు ఉపాధిలో ఈ ప్రాంతం రికార్డు
మంచులో దూసుకెళ్లిన వందే భారత్: Tourists Reaction | Katra–Srinagar | Snow Train | Asianet News Telugu