రైల్లో భారీ పేలుడు: పలువురికి గాయాలు

Published : Dec 01, 2018, 09:30 PM IST
రైల్లో భారీ పేలుడు: పలువురికి గాయాలు

సారాంశం

అస్సాంలోని ఉదల్గురి జిల్లాలోని ఇంటర్ సిటీ రైలులో పేలుడు సంభవించింది. శనివారం రాత్రి జరిగిన ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు.

గౌహతి: అస్సాంలోని ఉదల్గురి జిల్లాలోని ఇంటర్ సిటీ రైలులో పేలుడు సంభవించింది. శనివారం రాత్రి జరిగిన ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. ఉదల్గురిలోని హరిసింగలో కామాఖ్య - దేకర్గావ్ ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ రైలులోని ఓ కోచ్ లో పేలుడు సంభవించింది.

ఈ పేలుడులో 11 మంది దాకా గాయపడినట్లు తెలుస్తోంది. పేలుడు శనివారం రాత్రి 7.04 గంటలకు సంభవించినట్లు రైల్వే అధికారులు చెప్పారు 

గాయపడినవారిలో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. గౌహతికి 95 కిలోమీటర్ల దూరంలోని సంఘటనా స్థలానికి రైల్వే, పోలీసు అధికారులు హుటాహుటిన బయలుదేరారు. 

పేలుడు గ్రేనేడ్ వల్ల సంభవించిందా, ఐఈడి వల్ల సంభవించిందా అనేది తేలాల్సి ఉంది. పేలుడుకు కారణం తెలియాల్సి ఉంది.

 

PREV
click me!

Recommended Stories

వీడు మామూలోడు కాదు.. ఫిట్ నెస్ కా బాప్ బాబా రాందేవ్ నే చిత్తుచేసిన తోపు..! (Viral Video)
IRCTC New Rates: టికెట్ ధరలు పెంచిన రైల్వే.. హైదరాబాద్ నుంచి వైజాగ్, తిరుపతికి రేట్లు ఇవే !